Leading News Portal in Telugu

Xiaomi Issues Alert: No More Updates for These Phones, Check If Yours Is on the List


Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

Xiaomi: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి తాజాగా కొన్ని ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఇవ్వబోమని అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఆ ఫోన్లను వాడుతున్నట్లయితే ఇకమీదట ఏ ఆండ్రాయిడ్ వర్షన్, HyperOS అప్డేట్, సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా రాకపోవచ్చు. షావోమి సాధారణంగా తన ఫోన్లకు 2 లేదా 3 ఏళ్ల వరకూ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తుంది. కొన్ని ప్రీమియం ఫోన్లకు కొన్ని నెలలు అదనంగా వచ్చినా, అది పెద్ద విషయంగా పరిగణించాల్సిన అవసరం లేదు.

మీ ఫోన్ ఈ జాబితాలో ఉంటే, కొత్త ఫోన్ తీసుకునే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం వచ్చినట్లే. ఎందుకంటే, నిరంతరం మారుతున్న యాప్స్, వాటి సెక్యూరిటీ కారణాలు, కొత్త ఫీచర్ల అవసరం వంటి వాటికి మీ పాత ఫోన్ అనుకూలంగా ఉండకపోవచ్చు. కొత్త ఫోన్లు ఎక్కువ అప్డేట్లు అందించడంతోపాటు మెరుగైన పనితీరును కలిగి ఉంటాయి. మరి ఇ-ఆఫ్-లైఫ్ (EOL) జాబితాలో చేరిన ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి. అప్డేట్లు ఆగిన షావోమి, రెడ్మీ, పోకో ఫోన్ల జాబితా ఇలా ఉంది.

Xiaomi Mi 11 Ultra

Xiaomi Mi 11X Pro

Xiaomi Mi 11i

Xiaomi Civi 1S

Redmi K50 Pro

Redmi K50

Redmi K40 Pro+

Redmi K40 Pro

Redmi Note 11 Pro

Redmi 10 (2022)

POCO F4 GT

ఈ జాబితాలో ఉన్న ఫోన్లు కాల్ చేయడం, యాప్స్ వాడకం, ఫోటోలు తీయడం వంటి రోజూ చేసే పనులు అన్ని పని చేస్తాయి. కానీ.. ఇకపై కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ ఫిక్స్‌లు, లేదా HyperOS అప్‌గ్రేడ్‌లు రాకపోవడం అనేది ముఖ్యమైన విషయం. ఉదాహరణకి, POCO F4 GT 2022లో ఆండ్రాయిడ్ 12తో వచ్చింది. తరువాత Android 13, Android 14, HyperOS 2.0 అప్డేట్లు కూడా పొందింది. కానీ 2025లోకి వచ్చేసరికి ఈ ఫోన్ EOL జాబితాలోకి చేరింది. ఇకపై ఈ ఫోన్‌కు ఏమీ కొత్త అప్డేట్లు రావు.