Leading News Portal in Telugu

Customer slams Flipkart after getting used MacBook Pro in sealed box


  • రూ. 2.6 లక్షల విలువ చేసే యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఆర్డర్
  • పాత ల్యాప్‌టాప్ పంపిన ఫ్లిప్‌కార్ట్
Flipkart: రూ. 2.6 లక్షల విలువ చేసే యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఆర్డర్.. పాత ల్యాప్‌టాప్ పంపిన ఫ్లిప్‌కార్ట్

ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. ఒక్క క్లిక్‌తో షాపింగ్ ఇంట్లోనే పూర్తవుతుంది. వంటింటి సామాను నుంచి లక్షలు విలువ చేసే వస్తువులను కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. అయితే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి ఊహించని షాక్ తగులుతోంది. తాము బుక్ చేసుకున్న ఆర్డర్ కు బదులుగా సబ్బులు, పాత వస్తువులు వస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు రూ. 2.6 లక్షల విలువ చేసే యాపిల్ మ్యాక్‌బుక్ ప్రోను ఫ్లిప్ కార్టులో ఆర్డర్ చేశాడు.

తీరా డెలివరీ అయ్యాక చూస్తే అది పాత ల్యాప్ టాప్ అని తేలింది. వెంటనే రిటర్న్ ఇచ్చాడు కస్టమర్. కానీ రెండోసారి కూడా పాత ల్యాప్ టాప్ రావడంతో ఫ్లిప్ కార్టు తీరుపై మండిపడ్డాడు ఆ యువకుడు. ఈ సంఘటన మొత్తం వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీ ఇంత పెద్ద మోసం ఎలా చేసిందని అందరూ ప్రశ్నిస్తున్నారు? ఫ్లిప్‌కార్ట్ కంపెనీ తనను ఒకసారి కాదు, రెండుసార్లు మోసం చేసిందని యువకుడు పేర్కొన్నాడు.

దేవాన్షు ధండల్ అనే యూజర్ ఒక పోస్ట్‌లో మోసానికి సంబంధించిన మొత్తం సంఘటనను ప్రస్తావించారు. దీనితో పాటు, ఒక వీడియోను కూడా రుజువుగా పోస్ట్ చేశారు. దీనిలో ధండల్ ఫ్లిప్‌కార్ట్ తనను ఒకసారి కాదు, రెండుసార్లు మోసం చేసిందని చెబుతున్నాడు. నేను రూ. 2.6 లక్షల విలువైన మ్యాక్‌బుక్ ప్రోని ఆర్డర్ చేశానని, సీలు చేసిన ఆపిల్ బాక్స్‌లో పాత ఉపయోగించిన మోడల్‌ను పొందానని ధండల్ చెప్పాడు. ఓపెన్ చేస్తున్న సమయంలో వీడియో తీశామని చెప్పాడు. వెంటనే దాన్ని రిటర్న్ ఇచ్చానని.. అయితే తనకు రెండోసారి కూడా పాత ల్యాప్ టాప్ నే డెలివరీ చేశారని వాపోయాడు.

ధండల్ మాట్లాడుతూ.. నేను కస్టమర్ కేర్ తో మాట్లాడాను. రెండు రోజుల తర్వాత, నాకు కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది. నాకు రూ. 13,000 పరిహారం ఆఫర్ చేశారు. దాన్ని నేను తిరస్కరించాను. తర్వాత నాకు రూ. 18000 ఆఫర్ చేశారు. నేను దీన్ని కూడా తిరస్కరించాను. చివరికి ఫ్లిప్‌కార్ట్ కంపెనీ 10 శాతం ఆఫర్ చేసింది. దాన్ని నేను మళ్ళీ తిరస్కరించాను. తర్వాత, కంపెనీ ప్రొడక్టుని తిరిగి తీసుకోవడానికి నిరాకరించింది. ఆ తర్వాత 10 శాతం పరిహారం అడిగానని తెలిపాడు.

దేవాన్షు దండాల్ మూడు ప్రశ్నలు

ట్రెజర్ హాల్ ఆన్‌లైన్ విక్రేత నన్ను కాకుండా చాలా మందిని మోసం చేసాడు. 2023 నుంచి రెడ్డిట్, యూట్యూబ్, X వంటి ప్లాట్‌ఫామ్‌లలో మోసాలపై ఫిర్యాదులు అందాయి.

1 – నకిలీ ఉత్పత్తులను సీలు చేసిన బాక్సుల్లో ఎలా ప్యాక్ చేస్తున్నారు?

2. 2023 నుంచి ప్రజా ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ విక్రేత ఇప్పటికీ ఎలా యాక్టివ్‌గా ఉన్నాడు?

3 – ఫ్లిప్‌కార్ట్ కూడా లోపల ఏముందో ధృవీకరించలేకపోతే ఇది కస్టమర్లకి ఎలా భరోసా ఇస్తుంది?

ఇది కంపెనీ తప్పు కాదని, మోసం అని దేవాన్షు స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని మరియు కఠిన చర్యలు తీసుకోవాలని దేవాన్షు డిమాండ్ చేశారు. ఇది తెలిసిన నెటిజన్స్ లక్షలు ఖర్చు చేస్తున్నప్పుడు ఆన్

లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ స్టోర్ లలో ల్యాప్ టాప్ లను తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు.