Leading News Portal in Telugu

Vivo T4 Ultra Launched in India with 50MP Dual Cameras, 5500mAh Battery, and Dimensity 9300+ Chipset fill details are


  • కొత్త ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ vivo T4 Ultraను భారత మార్కెట్లో లాంచ్
  • 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 9300+ ప్రాసెసర్‌
  • 50MP ప్రాథమిక కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ కెమెరాగా 32MP ఆటోఫోకస్ కెమెరా.
  • 5500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
  • 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 37,999.
  • HDFC, SBI, Axis కార్డులపై రూ. 3000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్.
Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

Vivo T4 Ultra: ప్రపంచవ్యాప్తంగా బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ లను అందిస్తున్న వివో (vivo) తాజాగా తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ vivo T4 Ultraను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అబ్బురపరిచే ఫీచర్లు, అద్భుతమైన కెమెరా పనితీరు, పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షించనుంది. మరి ఈ వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ వివో T4 అల్ట్రా గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా..

అద్భుతమైన డిస్‌ప్లే:
vivo T4 Ultraలో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, పీక్ బ్రైట్నెస్ 5500 నిట్స్ సామర్థ్యంతో వస్తోంది. స్క్రీన్‌కు SCHOTT Xensation α గ్లాస్‌ ప్రొటెక్షన్ లభిస్తుంది.

పవర్‌ఫుల్‌ కెమెరాలు:
మొబైల్ వెనుక భాగంలో 50MP సోనీ IMX921 ప్రాథమిక కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీని ద్వారా 100x హైపర్ జూమ్, 10x టెలిఫోటో మాక్రో, Aura లైట్, 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాగా 32MP ఆటోఫోకస్ కెమెరా ఇచ్చారు.

శక్తివంతమైన ప్రాసెసర్:
ఈ ఫోన్‌కు MediaTek Dimensity 9300+ ప్రాసెసర్‌ను అందించారు. LPDDR5 RAM 8GB/12GB వరకు, UFS 3.1 స్టోరేజ్ 256GB/512GB వరకు లభిస్తుంది. శక్తివంతమైన VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15తో రన్ అవుతుంది. AI ఫీచర్లు గాను Circle to Search, Live Call Translation, Transcript Assist, Erase 2.0 వంటివి అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ:
ఈ మొబైల్ లో 5500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్‌ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో, Wi-Fi 6, Bluetooth 5.4, NFC వంటి ఫీచర్లు అందించాయి.
Image (7)

ధరలు, వేరియంట్లు:
ఫీనిక్స్ గోల్డ్, మీటియోర్ గ్రే కలర్ వేరియంట్లలో లభించే ఈ ఫోన్‌ జూన్ 18వ తేదీ నుంచి వివో, ఫ్లిప్ కార్ట్, ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తోంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 37,999గా నిర్ణయించబడింది. అలాగే, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ.39,999గా ఉంది. ఇక టాప్-ఎండ్‌ వేరియంట్‌ అయిన 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్‌ ధరను రూ.41,999గా వివో నిర్ణయించింది.

లాంచ్ ఆఫర్లు:
HDFC, SBI, Axis కార్డులపై రూ. 3000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్‌చేంజ్ బోనస్ కింద రూ. 5000 వరకు, అలాగే 9 నెలల వరకు నో కాస్ట్ EMI అవకాశం కల్పించనున్నారు.