
Cataract: కంటిశుక్లం అనేది ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కంటికి వచ్చే అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటి. ఇది కళ్లలో చూపుకు ఉపయోగపడే లెన్స్ మసకబారడాన్ని సూచిస్తుంది. దీనివల్ల అస్పష్టమైన, మసక దృష్టి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి కాలక్రమేణా లెన్స్ పూర్తిగా కనపడకుండా ఉండేంత వరకు పెరుగుతుంది. ఇది పసుపు లేదా తెల్లగా ఏర్పడుతుంది.
కంటిశుక్లం ఏర్పడడానికి ప్రధాన కారణాలు చూస్తే.. ఎక్కువగా బహిరంగంగా ఉండే వారికి కంటికి పొడిగా మారటం వల్ల ఈ పూత ఏర్పడుతుంది. అలాగే అత్యధికంగా అల్ట్రావయొలెట్ (UV) కాంతికి గురవడం వల్ల కూడా ఈ సమస్యలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఇంకా పొడి గాలులు, తేమ తక్కువ వాతావరణం కూడా కంటి పొరను దెబ్బతీసి కంటిశుక్లం ఏర్పడటానికి సహకరిస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో కంటికి రక్షణ వ్యవస్థ బలహీనపడడం వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలు రైతులు, బహిరంగాల్లో ఎక్కువసేపు పని చేసే వారికీ.. డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీస్, కన్‌స్ట్రక్షన్ వర్కర్లకు వచ్చే అవకాశం ఉంది.
మరి ఈ కంటిశుక్లం వచ్చిందండానికి లక్షణాలను గమనించినట్లయితే.. కంటి తెల్ల భాగంలో కాస్త చిన్న గోధుమ లేదా పసుపు రంగు మచ్చలు కనపడతాయి. అలాగే కంటి ఎరుపు, ఎక్కువగా నీరు రావడం, ఇంకా పొడిగా అనిపించడం, కొన్ని సందర్భాల్లో తేలికపాటి మంట లాంటివి అనిపిస్తాయి.
మరి ఈ సమ్యను ఎలా నివారించాలన్న విషయానికి వస్తే.. ముఖ్యంగా UV కాంతి నుంచి కళ్లను రక్షించేందుకు సన్ గ్లాసేస్ (UV-protected sunglasses) ఉపయోగించాలి. అలాగే కళ్ళకు ఇబ్బందిగా అనిపించినా సమయంలో చల్లటి నీటితో కళ్లను కడగడం మంచింది. ఇది కంటికి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సమస్య ఎక్కువగా అనిపిస్తే డాక్టర్ సంప్రదించి ఆయన సిఫార్సుతో ఐ డ్రాప్స్ వాడడం వాడడం మంచిది.
ఇకపోతే, నిజానికి చాలా సందర్భాల్లో కంటిశుక్లం హానికరం కాదు. కానీ, ఇది ఎక్కువై గడ్డలుగా మారితే లేదా చూపుపై ప్రభావం చూపితే శస్త్రచికిత్స అవసరమవచ్చు. అలాగే మంట, వాపు ఉంటే మందులు అవసరం అవుతాయి. అలగని కంటిశుక్లం చిన్న సమస్యగా కనిపించగలదిగానీ, దీన్ని నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు. నిర్దిష్ట జాగ్రత్తలు పాటించడం, అవసరమైతే వైద్యులను సంప్రదించడం ద్వారా దీన్ని నివారించవచ్చు. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రోజువారీ సంరక్షణ చాలా అవసరం.