
Best Time for S*x: శృంగారంలో పాల్గొనడానికి “అసలైన సమయం” అనే విషయం ఒకే విధంగా చెప్పలేం. దీనికి ముఖ్యకారణాలు చూస్తే.. ప్రతి జంట జీవనశైలి, శారీరక స్థితి, మానసిక స్పందన ఆధారంగా మారుతూ ఉంటుంది. అయినప్పటికీ శాస్త్రీయంగా, ఆరోగ్యపరంగా చూస్తే కొన్ని సమయాలు శృంగారానికి మరింత అనుకూలంగా ఉంటాయి. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా..
ఉదయాన్నే శృంగారానికి అనుకూల సమయం అని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే, ఆ సమయంలో పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయి అత్యధికంగా ఉంటుంది. ఇది లైంగిక ఉత్సాహాన్ని, శారీరక శక్తిని పెంచుతుంది. అలాగే మానసికంగా కూడా మనిషిని ఆ రోజంతా ఉత్సహంగా, మంచి మూడ్‌లో ఉండే ఉంచేందుకు సహకరిస్తుంది. ఉద్యమ సమయంలో ఎటువంటి మానసిక ఒత్తిడులు ఉండవు కాబట్టి రక్త ప్రసరణ బాగుండటం వల్ల శృంగార స్పందన మెరుగ్గా ఉంటుంది.
ఇక కొందరు రాత్రి సమయం బాధ్యతలు ముగించి, విశ్రాంతికి సిద్ధమయ్యే సమయం కావడంతో కొందరికి రాత్రే శృంగారానికి ఉత్తమంగా అనిపిస్తుంది. అయితే ఈ సమయంలో శారీరక శక్తి తగ్గిపోయి ఉండే అవకాశం ఉంది. దాని వల్ల అలసట లేదా ఒత్తిడి వల్ల ఇది ప్రతికూలంగా మారవచ్చు. శృంగారంలో హార్మోన్ల స్థాయిలు, మానసిక స్థితి, పరస్పర సమన్వయం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సరైన సమయాన్ని ఎంచుకుంటే శృంగార అనుభవం పరస్పర సంతృప్తికరంగా ఉంటుంది. ఇది సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఇలా చేయడం ద్వారా.. మానసిక ఆరోగ్యానికి, నిద్రకు, ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
మొత్తంగా శృంగారానికి అసలైన సమయం అన్నది ఒక వ్యక్తిగతమైన, జంటల పరంగా మారే అంశం. ఉదయం శారీరకంగా అనుకూలంగా ఉంటే, రాత్రి మానసికంగా సమయంగా ఉండవచ్చు. ముఖ్యంగా, ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం, ఆరోగ్యం, మానసిక స్థితి లాంటి అంశాలే ముఖ్యమైనవి. కాబట్టి ఒకరి అభిప్రాయానికే కాకుండా, పరస్పర అవగాహనతో సమయం ఎంచుకోవడమే శ్రేయస్కరం.