- వర్షాకాలంలో పెరుగుతున్న సంచారం
- పాములన్నీ విషయ పూరితాలు కావు
- పాము కాటు వేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలోని పొదలు, గుంతలు, పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాంటి సమయంలో తెలిసీ, తెలియక వాటిపై అడుగేయడం వల్ల కాటేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పదుల సంఖ్యలో పాము కాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారు. పాములన్నీ విషయ పూరితాలు కావు. రక్తపింజర, కట్లపాము, నాగుపాములు మాత్రం చాలా విషపూరితమైనవి.
READ MORE: Dmitry Medvedev: మా అణ్వాయుధాలను ఇరాన్‌కు ఇస్తాం.. రష్యా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
పాము కాటు వేస్తే ముందుగా ఏ ప్రాంతంలో వేసిందో గుర్తించాలి. శరీర భాగంపై కాటువేసిందా, దుస్తులపై నుంచి వేసిందా పరిశీలన చేసి, శరీరంపై కాటువేస్తే ఎన్ని గాట్లు పడ్డాయో చూడాలి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాములు కాటేస్తే రెండు గాట్లు మాత్రమే పడతాయి. సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ గాట్లు కనిపిస్తే అది విషం లేని పాముగా గుర్తించాలి.
READ MORE: IWMBuzz Digital Awards: ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న మాళవిక మోహనన్..!
బాధితుడు ఎక్కువగా కదలకుండా, ఆందోళన చెందకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కాటు వేసిన ప్రాంతాన్ని కోయడం, నోటితో పీల్చడం, మసాజ్ చేయడం, పైన కట్టుకట్టడం లాంటి పనులు చేయొద్దు.కరిచిన పాము ఏరకానికి చెందిందో తెలుసుకుంటే చికిత్స చేయడం సులభమవుతుంది. వీలైతే సెల్‌ఫోన్‌తో ఫొటో తీయాలి. విష పూరిత పాము కరిస్తే గాయపడిన వాపు, రక్తం గడ్డకట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నాటు వైద్యం, మంత్రాల నెపంతో వైద్యం అందించడం జాప్యం చేస్తే ప్రాణాంతకమవుతుంది.