Leading News Portal in Telugu

Xiaomi Mix Flip 2 with 6.85-inch Foldable Display and Dual 50MP Cameras Set to Launch on June 26


Xiaomi Mix Flip 2: 6.85 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 50MP + 50MP కెమెరాలతో విడుదలకు సిద్దమైన షియోమీ మిక్స్ ఫ్లిప్ 2..!

Xiaomi Mix Flip 2: ఈ మధ్యకాలంలో ఫ్లిప్ ఫోన్స్ హవా మళ్లీ మొదలైందని చెప్పవచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్స్ ధరలు కాస్త ప్రీమియంగా ఉన్న వినియోగదారులు వాటిని కొండడానికి తెగ ఉత్సహత చూపిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మార్కెట్ లో తన స్థానాలను కాపాడుకోవడానికి స్మాట్ ఫోన్ మొబైల్స్ తయారీ కంపినీలు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ.. మిక్స్ ఫ్లిప్ 2 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ను మార్కెట్‌లో ప్రీమియం శ్రేణిలో విధుల చేసంతుకు సిద్ధమైంది.

అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్, వినియోగదారులకు అత్యుత్తమ అనుభూతిని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ మొబైల్ సంబంధిత వివరాలను ఒకసారి చూద్దామా.. ఇందులో 6.85 అంగుళాల 1.5K LTPO మైన్ స్క్రీన్‌ ను ఉపయోగించి ప్రీమియం విజువల్ అనుభూతిని అందిస్తున్నారు. దీని ప్రత్యేకతగా పెద్ద సైజులోని సెకండరీ డిస్‌ప్లేను కూడా కలిగించి మల్టీటాస్కింగ్‌కు మరింత సౌలభ్యం కల్పించనున్నారు.

ఇక మొబైల్ బ్యాటరీ పరంగా చూస్తే.. ఇందులో 5050 నుంచి 5100mAh సామర్థ్యం గల దీర్ఘకాలిక బ్యాటరీ అందించబడనున్నట్లు సమాచారం. దీని ద్వారా ఒక రోజంతా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోకుండా ఉపయోగించవచ్చు. ఇక దీనికి 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటం మరో ప్రత్యేకత. అలాగే మొబైల్ కెమెరా సెటప్ విషయానికి వస్తే, డ్యూయల్ 50MP లెన్స్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 1/1.5 అంగుళాల ప్రాధమిక సెన్సార్‌ తోపాటు, 1/2.76 అంగుళాల అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలపడం ద్వారా ఫోటోగ్రఫీలో అద్భుతమైన స్పష్టత ఫోటోలు లభిస్తాయి.

ఈ డివైస్ IPX8 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుండటంతో నీటి తుంపరులు లేదా తడి వాతావరణంలోనూ దీన్ని ఆందోళన లేకుండా ఉపయోగించవచ్చు. భద్రతా పరంగా సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తున్న ఈ ఫోన్‌, పూర్తి స్థాయి NFC సపోర్ట్‌తో పేమెంట్స్, కనెక్టివిటీ వంటి అవసరాలను సమర్థవంతంగా నెరవేర్చుతుంది. ఈ ప్రత్యేక ఫీచర్లు అన్ని విభాగాల్లోనూ ప్రీమియం అనుభవాన్ని అందించేలా డిజైన్ చేయబడ్డాయి. ఆధునిక ఫోల్డబుల్ ఫోన్ అన్వేషణలో ఉన్నవారికి ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది. జూన్ 26న ఈ మొబైల్ లాంచ్ కానుంది. ధరతో పాటు మరిన్ని వివరాలు లాంచ్ రోజున తెలియనున్నాయి. ఈ లాంచ్ కార్యక్రమం లో ఈ మొబైల్ తోపాటు షియోమీ టాబ్లెట్ 7S ప్రో, రెడీమి K80 అల్ట్రా, రెడీమి K ప్యాడ్ లు కూడా లాంచ్ కానున్నాయి.