TECNO Spark Go 2 Launched at Rs 6999 with No-Signal Communication Feature and more interesting features are
- 6.67 అంగుళాల HD+ డాట్-ఇన్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
- మొబైల్ ప్రాసెసింగ్ కోసం UniSoC T7250 చిప్ సెట్
- వెనుకవైపు 13MP ప్రైమరీ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్‌తో, ముందు 8MP సెల్ఫీ కెమెరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో
- 5000mAh భారీ బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
- ‘No Network Communication’ ఫీచర్ ద్వారా మొబైల్ సిగ్నల్ లేకున్నా అత్యవసర ఫంక్షన్లు
- IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, DTS స్టీరియో స్పీకర్లు
- 4GB + 64GB మోడల్ ధర రూ. 6,999.

TECNO Spark Go 2: బడ్జెట్ ఫోన్ విభాగంలో టెక్నో కంపెనీ మరో కొత్త మోడల్‌ను భారత మొబైల్ మార్కెట్ లోకి విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన ‘Spark Go’ మోడల్ కు అప్డేటెడ్ గా వచ్చిన ఈ TECNO Spark Go 2 ధర కేవలం రూ. 6,999 మాత్రమే ఉన్నా, మొబైల్ లో అందించే ఫీచర్లు వింటే మాత్రం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలశ్యం ఆ వివరాలేంటో పూర్తిగా చూసేద్దామా..
* IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్, DTS స్టీరియో స్పీకర్లు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, USB టైపు-C పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
* అలాగే భారతీయ ప్రాంతీయ భాషల్లో స్పందించే Ella AI అసిస్టెంట్ ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణ.
* ఈ మొబైల్ 165.6×77×8.25 మిల్లీమీటర్ల పరిమాణం, 186 గ్రాముల బరువు ఉంటుంది.
ధర:
TECNO Spark Go 2 మొబైల్ ఇంక్ బ్లాక్, టైటానియం గ్రే, వేల్ వైట్, టర్కాయిస్ గ్రీన్ అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది. ఇక ధర విషయానికి వస్తే 4GB + 64GB మోడల్ ధర రూ. 6,999గా నిర్ణయించబడింది. జూలై 1 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకు ఇంత ఎక్కువ ఫీచర్లను అందించడం వలన TECNO Spark Go 2 ఫోన్ బడ్జెట్ కస్టమర్లకు ఒక మంచి ఎంపికగా నిలవనుంది.