- షియోమి నుంచి కొత్త ట్యాబ్లెట్ Xiaomi Pad 7S Pro రిలీజ్
- 10,610mAh బ్యాటరీ

ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షియోమీ కొత్త ట్యాబ్లెట్ ను రిలీజ్ చేసింది. Xiaomi Pad 7S Pro ను చైనాలో ఆవిష్కరించింది. Xiaomi Pad 7S Pro ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,300 (సుమారు రూ. 39,000) నుంచి ప్రారంభమవుతుంది. ‘ప్రో’ మోడల్ కావడంతో, ఇది 8GB, 12GB, 16GB RAM తో మల్టీపుల్ వేరియంట్లలో లభిస్తుంది. అత్యంత ఖరీదైన 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ CNY 4,500 (సుమారు రూ. 53,000) గా ఉంది. ఈ ట్యాబ్లెట్ చైనాలో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు లాంచ్ అవుతుందనే దాని గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఈ ట్యాబ్లెట్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది – నలుపు, ఊదా, టైటానియం సిల్వర్, బసాల్ట్ గ్రే. మ్యాట్ గ్లాస్ వెర్షన్ కూడా ఉంది.
Xiaomi Pad 7S Pro 12.5-అంగుళాల IPS LCD ప్యానెల్‌ను 2,136 x 3,200 పిక్సెల్‌లు, 3:2 యాస్పెక్ట్ రేషియోతో కలిగి ఉంది. ఈ ప్యానెల్ 1,000 నిట్ల వరకు పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ‘సాఫ్ట్ లైట్’ అనే మ్యాట్ గ్లాస్ వెర్షన్ కూడా ఉంది. ఇది మ్యాట్ స్క్రీన్ ప్రొటెక్టర్తో వస్తుంది. ప్యాడ్ 7S ప్రో Xiaomi XRING O1 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 3nm ప్రాసెస్‌పై నిర్మించారు. గరిష్టంగా 3.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ట్యాబ్లెట్ 8GB, 12GB వేరియంట్లకు LPDDR5X RAM, 16GB వేరియంట్‌కు LPDDR5T RAM కలిగి ఉంది. స్టోరేజ్ 1TB UFS 4.1 వరకు ఉంటుంది.
వెనుక భాగంలో f/1.8 అపర్చర్, PDAF తో 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ముందు వైపున ఉన్న కెమెరా f/2.2 అపర్చర్ తో 32-మెగాపిక్సెల్ యూనిట్. ప్యాడ్ 7S ప్రో ఆండ్రాయిడ్ 15 ఆధారిత Xiaomi, HyperOS 2 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. ఇది 10,610mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W వైర్డ్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కమ్యూనికేషన్ కోసం, USB టైప్-C పోర్ట్ (USB 3.2 Gen 1), Wi-Fi 7, బ్లూటూత్ 5.4 ఉన్నాయి. Xiaomi Pad 7S Pro కీబోర్డ్, Xiaomi Focus Pen, Xiaomi Pad 7S Pro కవర్ వంటి ఆప్షనల్ టూల్స్ తో వస్తుంది.