- గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైన Vivo X200 FE
- 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP ఫ్రంట్ కెమెరా.
- 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.
- ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, Hi-Res ఆడియో, స్టీరియో స్పీకర్లు.
- IP68 + IP69 రేటింగ్స్ తో నీరు, ధూళి నిరోధకత.

Vivo X200 FE: మొబైల్ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆశర్యపరిచే వివో కంపెనీ కొత్తగా తన పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ vivo X200 FE ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ తొలుత చైనాలో వివో S30 ప్రో మినీ పేరుతో విడుదలవ్వగా.. ఇప్పుడు మలేషియా మార్కెట్ నుంచి గ్లోబల్ గా విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ మొబైల్ గా విడుదలైన ఈ Vivo X200 FE గురించి ఓ లుక్ వేద్దామా..
Vivo X200 FE మొబైల్ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో..
* 6.31 అంగుళాల 1.5K 120Hz LTPO AMOLED డిస్‌ప్లే, 4320Hz PWM డిమ్మింగ్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
* మీడియాటెక్ Dimensity 9300+ 4nm ప్రాసెసర్, Immortalis-G720 GPU.
* 12GB LPDDR5X RAM, 512GB UFS 3.1 స్టోరేజ్.
* ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15.
కెమెరా సెటప్:
* 50MP సోనీ IMX921 ప్రధాన కెమెరా (OIS తో)
* 8MP అల్ట్రా వైడ్ లెన్స్
* 50MP IMX882 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, ZEISS ఆప్టిక్స్ తో
* 50MP ఫ్రంట్ కెమెరా (ఆటోఫోకస్ తో)
బ్యాటరీ, ఇతర ఫీచర్స్:
* 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, Hi-Res ఆడియో, స్టీరియో స్పీకర్లు.
* 5G SA/NSA, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB Type-C.
ధర:
ఈ ఫోన్ 12GB + 512GB మోడల్ ధర RM 3199 (రూ.64,800). ఇక ఈ మొబైల్ సంబంధించి ప్రత్యేక ఆఫర్ల విషయానికి వస్తే.. జూలై 4వ తేదీ వరకు ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులకు RM 200 డిస్కౌంట్ తో పాటు పీకలే పాడలే సెట్, వివో TWS 3e ఇయర్‌బడ్స్, 1 సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ, 1 సంవత్సరం స్క్రీన్ డామేజ్ రిప్లేస్‌మెంట్ వంటి బహుమతులు లభించనున్నాయి. ఇక భారత్ లో కూడా వివో X200 FE త్వరలో విడుదల కాబోతుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.