Leading News Portal in Telugu

Nothing Phone (3) Launched in India with Flagship Features, Glyph Matrix, and Exciting Offers and more details are


Nothing Phone 3: చూస్తే కొనేద్దామా అనేలా నథింగ్ ఫోన్ (3) లాంచ్.. స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలు ఇలా..!

Nothing Phone 3: చాలాకాలం నుండి నథింగ్ కంపెనీ నుండి రాబోయే Nothing Phone (3) ను అధికారికంగా భారత్‌లో విడుదల అయ్యింది. ఈ మొబైల్ కంపెనీ నుండి వచ్చిన మూడవ స్మార్ట్‌ ఫోన్ కాగా.. గత ఏడాది విడుదలైన Phone (2)కి అప్డేట్ వర్షన్ గా నిలుస్తోంది. ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ ఫీచర్లతో పాటు ఆకట్టుకునే కొత్త డిజైన్‌ తో విడుదలైంది. మరి ఈ Nothing Phone (3) స్పెసిఫికేషన్లతో పాటు మరిన్ని వివరాలను ఒకసారి చూసేద్దామా..

AI ఆధారిత ప్రత్యేక ఫీచర్లు:
ఈ Nothing Phone (3) మొబైల్ Android 15 ఆధారిత Nothing OS 3.5 పై రన్ అవుతుంది. ఇందులో ఫ్లిప్ టూ రికార్డు, ఎస్సెన్షియల్ స్పేస్ , ఎస్సెన్షియల్ సెర్చ్ వంటి AI ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. స్క్రీన్ చూడకుండానే ఫోన్‌ను కిందకు ఉంచడం ద్వారా సంభాషణలు రికార్డు చేసి, అందులోని సారాంశం అందించగల సామర్థ్యం ఇది కలిగి ఉంది.

Glyph Matrix టెక్నాలజీ:
ఇప్పటి వరకు ఈ మొబైల్స్ లో ఉన్న స్టాండర్డ్ గ్లిఫ్ LEDల స్థానంలో కొత్తగా 25×25 మైక్రో-LEDలతో Glyph Matrix డిజైన్‌ ను పరిచయం చేశారు. ఇది డిజిటల్ క్లాక్, బ్యాటరీ లెవెల్, కంపాస్, స్టాప్‌ వాచ్ వంటి అంశాలను చూపించగలదు. త్వరలో Glyph SDK కూడా విడుదల కానుంది.
Image
కెమెరా సెటప్:
Nothing Phone (3) మొబైల్ లో అన్ని లెన్స్‌ లపై 4K 60fps రికార్డింగ్ చేయవచ్చు. ఇందులో 50MP ప్రధాన కెమెరా (f/1.68, OIS, 1/1.3 ఇంచెస్ సెన్సార్), 50MP అల్‌ట్రా వైడ్ లెన్స్, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో (60X డిజిటల్ జూమ్, మాక్రో మోడ్), 50MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.

బ్యాటరీ:
Nothing Phone (3) మొబైల్ లో ఏకంగా 5500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ కలిగి ఉంది. దీనికి 65W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ ద్వారా కేవలం 54 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. వీటితోపాటు 15W వైర్లెస్ చార్జింగ్, 5W రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Image (2)
ధరలు, లాంచ్ ఆఫర్లు:
Nothing Phone (3) 12GB + 256GB వేరియంట్ ధర రూ. 79,999 కాగా, 16GB + 512GB వేరియంట్ ధర రూ. 89,999 గా నిర్ణయించారు. ఇక బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కలిసి డిస్కౌంట్ పోగా ముబైల్స్ ను రూ.62,999, రూ.72,999 కు పొందవచ్చు. ఇక లాంచ్ ఆఫర్లను చూసినట్లయితే.. ప్రీ-బుకింగ్ చేసిన వారికి Nothing Ear (14,999) ఉచితంగా లభిస్తుంది. జూలై 15న కొనుగోలు చేసిన వినియోగదారులకు 1 సంవత్సరం అదనపు వారంటీ కూడా లభిస్తుంది. అలాగే 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే జూలై 1 నుంచి ప్రారంభమయ్యాయి. జూలై 15, 2025 నుండి ఫ్లిప్ కార్ట్, ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.