
Honor Magic V5: హానర్ సంస్థ తాజాగా చైనాలో తన నూతన ఫోల్డబుల్ ఫోన్ హానర్ మ్యాజిక్ V5 (Honor Magic V5) ను అధికారికంగా విడుదల చేసింది. ఇది బుక్-స్టైల్ డిజైన్‌లో వచ్చిన మోడల్‌గా 7.95 అంగుళాల 2K రెజల్యూషన్ ఉన్న అంతర్గత OLED ఫోల్డబుల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 6.45 అంగుళాల LTPO OLED కవర్ స్క్రీన్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఈ ఫోన్ అత్యాధునిక Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్ తో రన్ అవుతుంది. దీనికి గరిష్ఠంగా 16GB RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో Android 15 ఆధారిత MagicOS 9.1 ఉపయోగించబడింది. దీని ద్వారా డీప్ సీక్ ఆధారిత AI ఫీచర్లు లభిస్తాయి.
ఈ హానర్ మ్యాజిక్ V5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OIS మరియు 3x ఆప్టికల్ జూమ్‌తో) ఉండగా.. ఫ్రంట్ భాగంలో రెండు 20MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇన్నర్ డిస్‌ప్లే పై, మరొకటి కవర్ స్క్రీన్ పై ఉంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ, ఛార్జింగ్ ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే.. 16GB + 1TB వేరియంట్ కు 6100mAh బ్యాటరీ రాగా, ఇతర మోడల్స్‌కు 5820mAh బ్యాటరీ అందించబడింది. అన్ని వేరియంట్స్ 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తాయి.
ఈ మొబైల్ IP58, IP59 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ తో ఫోన్ రక్షితంగా ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్లలో 5G, Wi-Fi 7, Bluetooth 6.0, GPS, NFC, డ్యూయల్ నానో సిమ్, USB Type-C పోర్ట్ ఉన్నాయి. డాన్ గోల్డ్, సిల్క్ రోడ్ డూన్ హుయాంగ్, వెల్వెట్ బ్లాక్, వార్మ్ వైట్ వంటి రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే హానర్ చైనా వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. అధికారిక విక్రయాలు జూలై 4 నుండి మొదలవుతాయి. ఇక మొబైల్ ధరల విషయానికి వస్తే.. 12GB + 256GB వేరియంట్ CNY 8,999 (సుమారుగా రూ .1,07,500), 16GB + 512GB వేరియంట్ CNY 9,999 (1,19,500), 16GB + 1TB వేరియంట్ CNY 10,999 (సుమారుగా 1,31,400) గా నిర్ణయించారు.