Leading News Portal in Telugu

Dubai Successfully Tests First Fully-Electric Air Taxi, Commercial Launch by 2026 Planned


Electric Air Taxi: దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ ప్రయోగం విజయవంతం.. కమర్షియల్ సేవలు ప్రారంభం..?

Electric Air Taxi: దుబాయ్ నగరంలో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రయోగాన్ని జోబీ ఏవియేషన్ విజయవంతంగా నిర్వహించింది. కాలిఫోర్నియాలో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ దుబాయ్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించడమే కాకుండా, ప్రజలకు వేగవంతమైన ప్రయాణ మార్గాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టబడింది. ఈ వాహనం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) నుంచి పామ్ జుమైరా వరకు కేవలం 12 నిమిషాల్లో ప్రయాణించగలదు. అదే ఈ ప్రయాణం భూమి మీద కారుతో చేస్తే సుమారు 45 నిమిషాలు పడుతుంది. పూర్తి ఎలక్ట్రిక్‌తో పనిచేసే ఈ విమానం పర్యావరణహితంగా, శబ్దరహితంగా ఉండటంతో నగరానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ ప్రయోగం దుబాయ్ నగరానికి సౌకర్యవంతమైన విమాన మార్గాలను అందించేందుకు తీసుకున్న ప్రముఖ పథకాలలో భాగం. ఇక ఈ ప్రయోగం సమయంలో విమానం నిటారుగా టేకాఫ్, కొన్ని మైళ్ల దూరం ప్రయాణించి మళ్లీ ల్యాండింగ్ చేసింది. ఈ కార్యక్రమానికి ఉన్నత ప్రభుత్వ అధికారులు, రవాణా శాఖ ప్రతినిధులు హాజరయ్యారు. Joby Aerial Taxi ఒక eVTOL (Electric Vertical Take-Off and Landing) వాహనం. ఇది గరిష్ఠంగా 160 కిలోమీటర్ల దూరం, అలాగే గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇప్పటికే దుబాయ్ రోడ్లు, రవాణా సంస్థ (RTA)తో ఒప్పందం కుదుర్చుకున్న జోబీ 2026లో కమర్షియల్ సర్వీసు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.

ఈ సర్వీస్ ప్రారంభ దశలో డిఎక్స్బీ విమానాశ్రయం, పామ్ జుమైరా, డౌన్‌టౌన్ దుబాయ్, మరియు దుబాయ్ మరీనా వద్ద నాలుగు వర్టీపోర్ట్‌లు ఏర్పాటు చేయబడతాయి. ఇదిలా ఉండగా.. రిగ్యులేటరీ అప్రూవల్స్, వర్టీపోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సవాళ్లు ఇంకా ఉన్నప్పటికీ ఈ రంగం నగర రవాణాలో భారీ మార్పుకు దారితీయనుంది.