- 6200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా
- 6.59-అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లే, 1.5K AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ.
- ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు.
- USB Type-C ఆడియో, IP66 + IP68 + IP69 ధూళి, నీటి నిరోధకత.

OPPO Reno 14: సుపరిచిత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) తాజాగా Reno 14 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో Reno 14, Reno 14 Pro మోడల్స్ విడుదలయ్యాయి. ఇదివరకు విడుదలైన Reno13 మోడల్ కు అప్డేటెడ్ వర్షన్ గా తీసుక వచ్చారు. ఇదివరకు మొబైల్స్ లో వదిన క్వాడ్ కర్వ్ డిస్ప్లేకి బదులుగా.. ఈ సిరీస్ ఫోన్లలో ఫ్లాట్ AMOLED డిస్ప్లేను ఉపయోగించారు. ఇందులో AI ఆధారిత కెమెరా ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి OPPO Reno 14 సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ను ఒకసారి చూసేద్దామా..
డిస్‌ప్లే, డిజైన్:
Reno 14లో 6.59-అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంది. అలాగే ఇందులో 1.5K AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ లభిస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్:
ఈ కొత్త ఒప్పో మొబైల్లో 6000mAh బ్యాటరీ ఉంది. దీనికి 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది.
కెమెరా ఫీచర్లు:
* 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో)
* 50MP 3.5X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
* 8MP అల్ట్రా వైడ్ కెమెరా
* 50MP సెల్ఫీ కెమెరా, 4K 60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్.
* AI Perfect Shot: ముఖ లక్షణాలు గుర్తించి అత్యుత్తమ ఫోటో తయారు చేయడం.
* AI Livephoto 2.0: షటర్ ల్యాగ్ లేకుండా క్షణాలను క్యాప్చర్ చేసే ఫీచర్.
* Livephoto Export: క్లిప్ నుండి బ్లర్ లేని స్టిల్ ఇమేజ్ తయారీ.
* AI Flash Livephoto: లో-లైట్ లో డైనమిక్ ఫ్లాష్ అడ్జస్ట్మెంట్.
ఇతర ఫీచర్లు:
* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు.
* USB Type-C ఆడియో, IP66 + IP68 + IP69 ధూళి, నీటి నిరోధకత.
* Wi-Fi 6, 5G SA/NSA, బ్లూటూత్ 5.4, నావిగేషన్ ఫుల్ సపోర్ట్.
ధర:
Oppo Reno 14 Pro 5G భారత మార్కెట్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతోంది. బేస్ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 49,999గా కాగా.. హైఎండ్ వేరియంట్ 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధరను రూ. 54,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను పెర్ల్ వైట్ (Pearl White), టైటానియం గ్రే (Titanium Grey) అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు.