
OPPO Pad SE: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) తాజాగా తన కొత్త టాబ్లెట్ ఒప్పో ప్యాడ్ SE (OPPO Pad SE) ను భారత్ లో లాంచ్ చేసింది. అబ్బురపరిచే స్పెసిఫికేషన్లు, తక్కువ ధరతో ఈ టాబ్లెట్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ కొత్త ఒప్పో ప్యాడ్ SE ఫీచర్లు ఏంటో ఒకసారి చూసేద్దామా..
డిస్‌ప్లే, డిజైన్:
ఈ కొత్త ఒప్పో Pad SEలో 11 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే (1920×1200 pixels) ను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 16:10 ఆస్పెక్ట్ రేషియో తో వస్తోంది. దీని బ్రైట్నెస్ గరిష్ఠంగా 500 నిట్స్ వరకూ ఉంటుంది. ఇది TUV Rheinland నుండి లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్లు పొందింది. అంటే ఇది కళ్లకి హాని చేయని ఐ-కేర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ డివైస్‌కి 36 నెలల Fluency Protection ఉంది. అంటే మూడేళ్ల పాటు ల్యాగ్ లేకుండా చక్కగా పని చేస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఇక RAM అండ్ స్టోరేజ్ వేరియంట్ల విషయానికి వస్తే.. ఇందులో 4GB + 128GB Wi-Fi, 6GB + 128GB LTE, 8GB + 128GB LTE (All UFS 2.2 storage) వంటి మూడు వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక నెట్‌వర్క్ అండ్ కనెక్టివిటీ లో 4G LTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), Bluetooth 5.4, USB Type-C పోర్ట్ ఉన్నాయి. ఈ ప్యాడ్ స్టార్లైట్ సిల్వర్, ట్విలైట్ బ్లూ వంటి రెండు రంగుల్లో లభిస్తుంది.
ధరలు:
* 4GB + 128GB Wi-Fi వేరియంట్ రూ.13,999
* 6GB + 128GB LTE వేరియంట్ రూ.15,999
* 8GB + 128GB LTE: వేరియంట్ రూ.16,999.
ఇక ఒప్పో Pad SE తొలి సేల్ సందర్భంగా రూ.1,000 డిస్కౌంట్ కూపన్ తో ప్రారంభ ధర రూ.12,999గా ఉంటుంది. ఇది ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్ కార్ట్, ఆఫ్‌లైన్ ఒప్పో బ్రాండ్ స్టోర్లు ద్వారా అందుబాటులో ఉంటుంది.