Leading News Portal in Telugu

HUAWEI Watch Fit 4 Series Launched in India: AMOLED Display, 100+ Workout Modes, ECG and Up to 10-Day Battery Life


HUAWEI Watch Fit 4 Series: స్టైలిష్ డిజైన్, అద్భుతమైన ఆరోగ్య ఫీచర్లతో హువాయి స్మార్ట్‌వాచ్‌లు లాంచ్..!

HUAWEI Watch Fit 4 Series: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ హువాయి (HUAWEI) భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌వాచ్‌లను HUAWEI WATCH FIT 4, WATCH FIT 4 Pro లను లాంచ్ చేసింది. ఇవి ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అత్యాధునిక ఆరోగ్య ఫీచర్లతో ఈ వాచ్‌లు లాంచ్ అయ్యాయి. మరి ఈ రెండు రకాల స్మార్ట్‌వాచ్‌ల గురించి చూద్దమా..

WATCH FIT 4 సిరీస్‌లో రెండు మోడళ్లకూ 1.82 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 480×408 పిక్సెల్స్, 347 PPI పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉండి 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. దీని వల్ల ఎండలోనూ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. హువాయి WATCH FIT 4, FIT 4 Pro రెండింట్లోనూ 24 గంటల ఆరోగ్య నిఘా అందుతుంది. ఇవి హృదయ స్పందన (Heart Rate), ఆక్సిజన్ స్థాయి, నిద్ర నాణ్యత, ఒత్తిడి స్థాయి, ఇంకా మహిళలలో నెలసరి ఋతుచక్రాలను ట్రాక్ చేస్తాయి.

ఇక ధరలు, కలర్ ఆప్షన్లు, లభ్యత విషయానికి వస్తే.. వాచ్ ఫిట్ 4 మోడల్‌ ధర రూ.12,999 గా నిర్ణయించబడింది. ఇది బ్లాక్, వైట్, పర్పుల్, గ్రే రంగులలో లభ్యమవుతుంది. ఇది ఆరోగ్యాన్ని గమనించడంలో ఆసక్తి ఉన్న వారికి పైనలైటెడ్ డిజైన్‌తో హైఎండ్ ఫీచర్లను అందిస్తుంది. అలాగే వాచ్ ఫిట్ 4 ప్రో మోడల్ ధర రూ. 20,999. ఈ ప్రో వర్షన్ గ్రీన్ నైలాన్, బ్లూ ఫ్లోరోఎలాస్టోమర్, బ్లాక్ ఫ్లోరోఎలాస్టోమర్ రంగులలో అందుబాటులో ఉంది. ఈ రెండు వాచ్ మోడల్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ-కామర్స్ వేదికలపై ప్రీఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి.