Leading News Portal in Telugu

HMD T21 Tablet Launched in India with 10.36 inches 2K Display, 8200mAh Battery at Rs 14499 Introductory Price


HMD T21 Tablet: వాయిస్ కాలింగ్, 8200mAh బ్యాటరీతో HMD T21 విడుదల..!

HMD T21 Tablet: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ HMD Global భారత మార్కెట్లోకి తన తాజా టాబ్లెట్ HMD T21 ను విడుదల చేసింది. ఇది గతంలో Nokia T21 పేరుతో 2023లో లాంచ్ అయిన మోడల్‌కే కొనసాగింపుగా వచ్చిందని అనుకోవచ్చు. అయితే దీనిని స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పులు చేయకుండా కేవలం “HMD” బ్రాండింగ్ తో విడుదలైంది. ఈ టాబ్లెట్‌లో 10.36-అంగుళాల 2K LCD స్క్రీన్, UNISOC T612 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4G వాయిస్ కాలింగ్, 8MP కెమెరాలు, IP52 రేటింగ్, 8200mAh బ్యాటరీ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ HMD T21 టాబ్లెట్ సంబంధించిన పూర్తి వివరాలు చూద్దామా..

Image (8)

HMD T21 ముఖ్య ఫీచర్లు:
డిస్‌ప్లే: 10.36-అంగుళాల IPS LCD స్క్రీన్, 2K రెజల్యూషన్ (2000×1200 పిక్సెల్స్), 5:3 ఆస్పెక్ట్ రేషియో, 400 నిట్స్ బ్రైట్‌నెస్, Toughened గ్లాస్ ప్రొటెక్షన్.

ప్రాసెసర్: 1.82GHz స్పీడ్ గల UNISOC T612 ఆక్టా-కోర్ 12nm ప్రాసెసర్.

GPU: Mali-G57

ర్యామ్ అండ్ స్టోరేజ్: 8GB LPDDR4 RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (512GB వరకు microSD తో విస్తరించవచ్చు).

ఆపరేటింగ్ సిస్టమ్: Android 13 (Android 14 కు అప్‌గ్రేడ్ అవుతుంది).

కెమెరాలు: 8MP ఆటోఫోకస్ రియర్ కెమెరా (LED ఫ్లాష్‌తో), 8MP ఫ్రంట్ కెమెరా

ఆడియో: 3.5mm జాక్, FM రేడియో, స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, OZO ఆడియో సపోర్ట్.

Image (7)

బ్యాటరీ: 8200mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్: IP52 రేటింగ్

నెట్‌వర్క్ కనెక్టివిటీ: 4G LTE వాయిస్ కాలింగ్, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), Bluetooth 5.0, GPS + GLONASS, USB Type-C

బరువు, డైమెన్షన్స్: 467 గ్రాములు, 247.5 x 157.3 x 7.5 mm

కలర్: బ్లాక్ స్టీల్.

ధర: HMD T21 టాబ్లెట్‌ 8GB + 128GB వేరియంట్ అసలు ధర రూ.15,999 కాగా.. లాంచింగ్ ఆఫర్‌గా రూ.14,499కు HMD వెబ్‌సైట్‌లో విక్రయించబడుతుంది.