Leading News Portal in Telugu

AI Video Goes Viral: Looks Real, But Its Completely Fake


AI Video: వాస్తవాన్ని తలపించే నకిలీ వీడియో.. వీడియో వైరల్..!

AI Video: సాధారణ భారతీయ కుటుంబం జన్మదిన వేడుక జరుపుకుంటున్నట్లు కనిపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ టేబుల్‌పై కేక్ పెట్టడం, ఓ పురుషుడు కొవ్వొత్తిని ఊదడం, పిల్లలు చప్పట్లు కొట్టడం లాంటి సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. మొదట చూస్తే ఇది నిజమైన హోమ్ వీడియో అనిపిస్తుంది. కానీ, నిజానికి ఇది కృత్రిమ మేధస్సు (AI) సాయంతో రూపొందించిన నకిలీ వీడియో.

ఈ వీడియోను Flux Pro with Seedance అనే ఏఐ మోడల్‌తో రూపొందించారు. ఇది “అత్యంత సాదాసీదా హోమ్ వీడియో” స్టైల్‌ను లక్ష్యంగా తీసుకుని రూపొందించబడింది. అయితే, ఈ వీడియోలోని కొన్ని చిన్న చిన్న లోపాలు దీని అసలు వీడియో కాదని చెప్పవచ్చు. ఈ వీడియో అసలైనది కాదని చెప్పే కొని సూచనలు ఏంటంటే..

Hyderabad: ఇంటి దొంగ దొరికిందోచ్.. బెట్టింగ్‌కి బానిసై అన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డ సోదరి..

*మహిళ రెండు చెవుల్లో రెండు భిన్నమైన ఇయర్ రింగ్స్ ధరించింది.

* కొవ్వొత్తి ఆర్పిన తర్వాత మరింత ప్రకాశవంతంగా కనిపించింది.

* వెనుక ఉన్న బాలుడు ఒక చేతితోనే చప్పట్లు కొడుతున్నాడు.

* పురుషుడి టీ-షర్ట్‌పై ఉన్న అక్షరాలు అర్ధం లేనివిగా ఉన్నాయి.

* ఆ మగ వ్యక్తి పట్టున్న కార్డ్‌బోర్డ్ బాక్స్, కేక్ టేబుల్‌పై పెట్టిన తర్వాత మాయమైంది.

Viral Video: స్టేటస్ లేక పిచ్చా..? చాండిలియర్‌గా ఫెరారీ కార్ ఏంటి భయ్యా..!

ఈ వీడియో నకిలీ అయినప్పటికీ.. ఇది ఏఐ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెబుతుంది. నిజమైన వీడియోలేనా? కృత్రిమ మేధస్సు సృష్టించిందా? అనే తేడాను గుర్తించడం కష్టమవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్ల రియాక్షన్లు భిన్న రకాలుగా ఉన్నాయి. నమ్మలేకపోతున్నా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో, ఇక మనం అయిపోయాం అంటూ స్పందించారు. ఇంకొందరు ఏఐ రూపొందించిందని అసలు అనుకోలేదని కామెంట్ చేస్తున్నారు.