iQOO Z10R with Quad-Curved AMOLED Display, 50MP OIS Camera and 5700mAh battery Launching in India on July 24
- 5700mAh భారీ బ్యాటరీ
- 50MP Sony IMX882 కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా
- IP68, IP69 రేటింగ్.

iQOO Z10R: ఐక్యూ తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z10R భారత మార్కెట్లో జూలై 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది Z10 సిరీస్‌లో ఫోన్ కాగా.. చాలా ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్ కానుంది. ఈ iQOO Z10R ఫోన్ లో మీడియాటెక్ Dimensity 7400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది మునుపటి Z9s మోడల్‌లోని Dimensity 7300కి అప్గ్రేడ్‌గా వస్తుంది. ఈ ఫోన్‌లో 12GB RAM తో పాటు 8GB వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది.
ఈ మొబైల్ లో ప్రధానంగా 50MP Sony IMX882 కెమెరా లెన్స్‌ను OIS (Optical Image Stabilization) సపోర్ట్‌తో అందిస్తున్నారు. దీనితో పాటు ఆర లైట్, 2x పోర్ట్రైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేయడం ఈ సెగ్మెంట్‌లో తొలిసారి జరగనుందని కంపెనీ తెలుపుతుంది. iQOO Z10R ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన అతి సన్నని కర్వ్డ్ డిస్‌ప్లేగా చెప్పవచ్చు. ఈ మొబైల్ 7.39 మిల్లీమీటర్లు మందం మాత్రమే ఉంటుంది.
WCL 2025: జులై 20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్!
ఈ ఫోన్ చాలా తక్కువ మందం ఉన్న కానీ 5700mAh భారీ బ్యాటరీ ఉంది. దీని వల్ల దీర్ఘకాలిక ఉపయోగానికి అనువుగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ లో IP68, IP69 రేటింగ్‌తో వస్తుండటంతో.. నీరు, ధూళి నుంచి కూడా రక్షణ లభిస్తుంది. iQOO Z10R ఫోన్‌ను వివో గ్రేటర్ నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇది ఆక్వామెరైన్, మూన్ స్టోన్ రంగుల్లో లభించనుంది. ఈ ఫోన్‌ను అమెజాన్, ఐక్యూ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను వివో బ్రాండ్‌తో “vivo T4R” పేరుతో కూడా విడుదల చేయవచ్చని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది vivo T4 సిరీస్లో భాగంగా ఉండే అవకాశం ఉంది.
Attempted R*ape: కళాశాలలో దింపుతానని నమ్మించి.. బాలికను బైక్ పై ఎక్కించుకుని అత్యాచారయత్నం
మొత్తంగా iQOO Z10R ఫోన్ అనేక ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో, మంచి డిజైన్‌తో, మంచి కెమెరా ఫీచర్లతో, ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో భారత మార్కెట్‌లో తక్కువ ధర సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తోంది. జూలై 24న అధికారికంగా లాంచ్ కాబోతున్న ఈ ఫోన్‌పై ఇప్పటికే టెక్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరిన్ని పూర్తి వివరాలు జూలై 24న లాంచ్ సమయంలో తెలియనున్నాయి.