Leading News Portal in Telugu

Instagram Testing ‘Auto Scroll’ Feature for Reels, Watch Without Swiping


Instagram Auto Scroll: ఇక రీల్స్ స్వైప్ చేయాల్సిన అక్కర్లే..  ఆటోమేటిక్‌గా నెక్స్ట్ రీల్ చూసేయ్యండి!

Instagram Auto Scroll: సోషల్ మీడియా ప్రపంచంలో ఇంస్టాగ్రామ్ రీల్స్ ఒక సాధారణ వినోదం నుంచి ఓ వ్యసనంగా మారి పోయింది. పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో మెటా సంస్థ ఇప్పుడు మరింత వినూత్నమైన ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దాని పేరు ‘Auto Scroll’. ఇది పూర్తి స్థాయిలో రీల్స్ అనుభూతిని మార్చేసే దిశగా రూపొందుతుంది. మరి ఈ ఫీచర్ ఏంటి..? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది..? అనే వివరాలను చూద్దామా..

Huawei Mate XT 2: ట్రిపుల్-ఫోల్డ్ డిజైన్‌, సరికొత్త చిప్‌సెట్, శాటిలైట్ కనెక్టివిటీలతో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్దమైన టెక్ దిగ్గజం హువావే..!

Image (10)

‘Auto Scroll’ అనే ఈ కొత్త ఫీచర్, రీల్స్‌ను తనంతట అవే (Hands Free) స్క్రోల్ చేసేలా రూపొందించబడుతోంది. యూజర్ ఎటువంటి స్వైప్ చేయకుండానే, ఒక రీల్ పూర్తయిన వెంటనే నెక్స్ట్ రీల్‌కు స్క్రోల్ అవుతుంది. ఇది ఒక చిన్న మార్పులా కనిపించినా, రీల్స్ ను చేసే వీలును మరింత పెంచేందుకు ఇదొక కీలక అడుగుగా మారనుంది. ఒకవేళ Auto Scroll ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వినియోగదారులు మాన్యువల్‌గా స్వైప్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. దీనివల్ల క్రియేటర్లకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశముంది. కొద్ది సమయంలోనే ఎక్కువ కంటెంట్ యూజర్‌ చూస్తే, అల్గారిథమ్‌ లలో మంచి రీచ్ ఏర్పడే వీలుంది.

Image (9)

iQOO Z10R: 5700mAh బ్యాటరీ, 50MP OIS కెమెరాలతో పాటు ప్రీమియం ఫీచర్లతో జూలై 24న వచ్చేస్తున్న ఐక్యూ Z10R..!

ఇంతకీ ఇది ఎంత వరకూ ఉపయోగకరమో అనేది ఒక వైపు, మరోవైపు డిజిటల్ వ్యసనం గురించి ఆందోళనలు మొదలయ్యాయి. యూజర్లు తమ చేతుల్లో నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మనం స్క్రోల్ చేయకుండానే కంటెంట్ ముందుకు పోతే, ఏ కంటెంట్‌కు ఆగాలి, ఏదాన్ని దాటేయాలి అనే ఆలోచనే తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ Auto Scroll ఫీచర్‌ను మెటా కొంతమంది యూజర్లతో టెస్టింగ్ దశలో ఉంచింది. అయితే, ఇది ఇప్పుడు అందిరికి అందుబాటులో లేదు. ఈ టెస్టింగ్ విజయవంతం అయితే, త్వరలోనే ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా వస్తుందని సమాచారం.