Leading News Portal in Telugu

Huawei Mate XT 2 with Triple-Fold Design, Kirin 9020, and Satellite Connectivity Expected to Launch in September 2026


Huawei Mate XT 2: ట్రిపుల్-ఫోల్డ్ డిజైన్‌, సరికొత్త చిప్‌సెట్, శాటిలైట్ కనెక్టివిటీలతో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్దమైన టెక్ దిగ్గజం హువావే..!

Huawei Mate XT 2: చైనా టెక్ దిగ్గజం హువావే స్మార్ట్‌ఫోన్ రంగంలో సునామి సృష్టించడానికి సిద్ధమవుతోంది. గత సంవత్సరం సెప్టెంబరులో విడుదలైన Huawei Mate XT అల్టిమెట్ డిజైన్ ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్‌కు సక్సెసర్‌గా త్వరలోనే Huawei Mate XT 2 పేరుతో కొత్త మోడల్‌ ను మార్కెట్‌ లోకి తీసుకురానున్నట్టు సమాచారం. అధికారికంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఇప్పటికే చైనా టిప్‌స్టర్ “డిజిటల్ చాట్ స్టేషన్” వేర్బోలో షేర్ చేసిన లీక్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలను తెలిపింది.

ప్రాసెసర్:
Huawei Mate XT 2లో Kirin 9020 5G ప్రాసెసర్ ఉండబోతున్నట్టు లీక్స్ చెబుతున్నాయి. ఇది గత XT మోడల్‌లో వాడిన Kirin 9010 చిప్‌సెట్‌కు అప్‌గ్రేడ్‌గా భావించవచ్చు. కొత్త చిప్‌సెట్ వల్ల ఫోన్ పనితీరు మరింత మెరుగవుతుందని ఊహించవచ్చు.

Image (7)

iQOO Z10R: 5700mAh బ్యాటరీ, 50MP OIS కెమెరాలతో పాటు ప్రీమియం ఫీచర్లతో జూలై 24న వచ్చేస్తున్న ఐక్యూ Z10R..!

కెమెరా:
ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుందని, అది వేరియబుల్ అపెర్చర్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇది స్వతంత్రంగా వివిధ లైటింగ్ పరిస్థుతులకు తగ్గట్టు అపెర్చర్‌ను మార్చగలదు. అంతేకాకుండా, మెరుగైన పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఈసారి వస్తుందని లీకులు చెబుతున్నాయి. ఫోన్‌లో ఉపగ్రహ కనెక్టివిటీ (Satellite Connectivity) కూడా ఉండే అవకాశం ఉంది.

డిస్ప్లే:
Huawei Mate XT 2లో గత మోడల్‌లా ట్రిపుల్-ఫోల్డబుల్ డిజైన్ ఉంటుంది. అంటే, మొబైల్‌ను మూడు విడతలుగా మడవవచ్చు. ఫుల్‌గా ఓపెన్ చేస్తే 10.2 అంగుళాల LTPO OLED ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే, మొదటి మడత వద్ద 7.9 అంగుళాల డిస్‌ప్లే, చివరికి మూడో మడత వద్ద 6.4 అంగుళాల స్మార్ట్‌ఫోన్-స్టైల్ డిస్‌ప్లే కనిపిస్తుంది. ఇదే డిస్‌ప్లే సైజును Huawei Mate XT 2లో కూడా కొనసాగించే అవకాశముందని అంచనా.

Image (8)

WCL 2025: జులై 20న భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్!

బ్యాటరీ:
Huawei Mate XT Ultimate Design మాదిరిగానే కొత్త XT 2 మోడల్‌లో కూడా 5600mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 66W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నారు. భారీ డిస్‌ప్లే డిమాండ్స్‌ను తీర్చేందుకు ఇది బాగా సరిపోతుంది.

Huawei ఈ ఫోన్‌ను GRL-AL20 మోడల్ నంబర్‌తో రిజిస్టేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు స్క్రీన్‌షాట్‌ల ద్వారా తెలిసింది. లీకుల ప్రకారం, సెప్టెంబర్ 2025లో Huawei ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేయనుంది. ఈ మొబైల్ Samsung Galaxy Z Tri-Fold తో పోటీ పడనుంది. గత సంవత్సరం చైనా మార్కెట్‌లో Huawei Mate XT Ultimate Design 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ CNY 19,999 (రూ. 2,35,900)కి వచ్చింది. ఈ ఫోన్‌లో HarmonyOS 4.2 ఉంది. 50MP OIS కెమెరా, 12MP అల్ట్రావైడ్, 12MP టెలిఫోటో లెన్స్, భారీ బ్యాటరీ, హై-ఎండ్ ఫోల్డబుల్ డిస్‌ప్లే వంటి పలు హైలైట్లు ఉన్నాయి.