Tempt Launches Two New MagSafe-Compatible Wireless Power Banks in India: Joos Mag 5K and Joos Mag 10K

Tempt Power Bank: ప్రముఖ గ్యాడ్జెట్ బ్రాండ్ టెంప్ట్ భారత మార్కెట్లోకి రెండు కొత్త MagSafe కంపాటిబుల్ వైర్లెస్ పవర్‌బ్యాంకులను విడుదల చేసింది. ఇవి Joos Mag 5K (5000mAh), Joos Mag 10K Magnetic (10000mAh) పేరిట అందుబాటులోకి వచ్చాయి. మినిమలిస్టిక్ డిజైన్‌తో, మెటల్ బాడీ ఫినిష్‌తో మార్కెట్లో వినియోగదారులను ఆకట్టుకునేలా ఇవి రూపొందించబడ్డాయి. మరి ఈ వైర్ లెస్ పవర్ బ్యాంకు గురించి పూర్తి వివరాలను చూద్దామా..
టెంప్ట్ కంపెనీ తన ఇండియన్ మార్కెట్‌కి రెండు కొత్త MagSafe-కంపాటిబుల్ వైర్లెస్ పవర్‌బ్యాంకులతో అడుగు పెట్టింది. వీటిలో Joos Mag 5K మోడల్లో 5000mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీని మందం కేవలం 9.7mm. ఇక Joos Mag 10K మోడల్ అయితే 10000mAh కెపాసిటీతో, 14.7mm స్లిమ్ డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఈ రెండు మోడల్స్‌కి MagSafe మాగ్నెటిక్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఇది ప్రత్యేకించి ఐఫోన్ వినియోగదారుల కోసం రూపొందించగా.. మాగ్నెటిక్‌గా సులభంగా ఫోన్‌ను అమర్చిన వెంటనే ఛార్జ్ చేయవచ్చు. 15W వైర్లెస్ ఛార్జింగ్ స్పీడ్ ద్వారా 30 నిమిషాల్లో iPhone బ్యాటరీని సుమారు 25% వరకూ ఛార్జ్ చేయగలదు.
Kantara : ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్ కంప్లీట్ – వైరల్ అవుతున్న జర్నీ గ్లింప్స్.. !
పవర్‌బ్యాంక్‌లో 22.5W USB-C వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 30 నిమిషాల్లో దాదాపు 50% వరకు బ్యాటరీ ఛార్జ్ చేయగలదు. అందులో రెండు ఔట్ పుట్ పోర్ట్స్ ఉన్నందున ఒకేసారి రెండు డివైస్‌లను ఛార్జ్ చేయడం సాధ్యపడుతుంది. టెంప్ట్ Joos పవర్‌బ్యాంక్స్ భద్రతపరంగా కూడా నమ్మదగిన వాటిలో ఉంటాయి. వీటిలో ఫైర్-రెసిస్టెంట్ మెటీరియల్, ఓవర్‌లోడ్, ఓవర్‌వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ రక్షణలతో అనేక భద్రతా వ్యవస్థలు అమర్చబడ్డాయి.
Gandikota Murder Case: మిస్టరీగానే గండికోట మైనర్ బాలిక హత్య కేసు..
డిజైన్ పరంగా చూస్తే, ఈ పవర్‌బ్యాంకులు బలమైన ఏరోస్పేస్ మెటల్ బాడీతో రూపొందించబడి. అలాగే ఇందులో LED చార్జింగ్ ఇండికేటర్లు కలిగి ఉంటాయి. ఇవి BIS సర్టిఫైడ్, ఫ్లైట్-సేఫ్, అలాగే మేడ్ ఇన్ ఇండియా గుర్తింపు కలిగినవి. కంపెనీ వీటికి 6 నెలల వారంటీ కూడా అందిస్తోంది. ధర పరంగా Joos Mag 5K మోడల్ ధర రూ. 1,699, అలాగే Joos Mag 10K మోడల్ ధర రూ.2,199గా నిర్ణయించారు. ఈ రెండు మోడల్స్‌ను అమెజాన్, టెంప్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.