- కొత్త realme Buds T200 విడుదల
- 50 గంటల ప్లే బ్యాక్ టైం.
- కేవలం రూ.1,999కే.. బ్యాంక్ ఆఫర్‌తో రూ.1,699కే పొందే అవకాశం.

Realme Buds T200: రియల్మీ తన బడ్స్ T సిరీస్ లో భాగంగా కొత్త realme Buds T200 ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. అత్యంత తక్కువ ధరతో వచ్చిన ఈ బడ్జెట్ ట్రూలీ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్, అధునాతన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త బ్యాలెన్స్‌డ్ సౌండ్, ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లతో realme Buds T200 టెక్నాలజీ ప్రియులకు ఒక అందుబాటు ధరలో ప్రీమియం అనుభవాన్ని అందిస్తోంది. మరి వీటి పూర్తి వివరాలను చూద్దామా..
ప్రీమియం ఆడియో ఫీచర్లు:
* 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్ సహాయంతో పవర్‌ఫుల్ సౌండ్.
* LDAC సపోర్ట్, Hi-Res ఆడియో సర్టిఫికేషన్.
* 360° స్పేషియల్ ఆడియో అనుభవం.
* SBC, AAC, LDAC కోడెక్స్‌లకు సపోర్ట్.
iOS 26 Public Beta: లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 పబ్లిక్ బీటా విడుదల.. కొత్త ఫీచర్లు, కొత్త అనుభవం ఇక మీసొంతం..!
యాక్టివ్ నాయిస్ కాన్స్‌లేషన్ (ANC):
* 32dB వరకు యాక్టివ్ నాయిస్ కాన్స్‌లేషన్ అందించగల సామర్థ్యం.
* ప్రతి బడ్ లో 2 మైకులు కలిపి మొత్తం 4 మైకుల సిస్టమ్.
* ఫోన్ కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తగ్గించడంతో క్లియర్ వాయిస్.
గేమింగ్, కనెక్టివిటీ:
* 45ms అల్ట్రా-లో లేటెన్సీ గేమ్ మోడ్.
* బ్లూటూత్ 5.4 టెక్నాలజీ.
* డ్యూయల్ డివైస్ కనెక్షన్: ఒకేసారి రెండు డివైసులకు కనెక్ట్ అయ్యే అవకాశం.
* గూగుల్ ఫాస్ట్ పెయిర్, రియల్‌మీ లింక్ యాప్ సపోర్ట్.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్:
* ప్రతి ఇయర్‌బడ్‌లో 58mAh బ్యాటరీ ఉంటుంది.
* AAC + ANC ఆఫ్ – 10 గంటల ప్లేబ్యాక్.
* AAC + ANC ఆన్ – 8 గంటలు.
* LDAC + ANC ఆన్ – 4.5 గంటలు.
* ఛార్జింగ్ కేసులో 530mAh బ్యాటరీ
Supreme Court: 2026 జనగణన తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు.. డీలిమిటేషన్ పై పిటిషన్ తిరస్కరణ
మొత్తం ప్లేబ్యాక్:
* 50 గంటలు (ANC ఆఫ్)
* 35 గంటలు (ANC ఆన్)
* 20 గంటలు (LDAC + ANC ఆన్)
* 10 నిమిషాల్లో 5 గంటల ప్లేబ్యాక్ అందించే ఫాస్ట్ ఛార్జింగ్
డిజైన్ అండ్ ప్రొటెక్షన్:
* క్రిస్టల్ అలాయ్ డిజైన్ తో ప్రీమియం లుక్.
* IP55 రేటింగ్ – వర్షం, దుమ్ము నుంచి రక్షణ.
* స్మార్ట్ టచ్ కంట్రోల్స్, రియల్‌మీ లింక్ యాప్‌లో EQ ట్యూనింగ్ అండ్ ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్.
ధర:
realme Buds T200 ను కంపెనీ మిస్టిక్ గ్రే, స్నోవీ వైట్, డ్రీమీ పర్పుల్, నియాన్ గ్రీన్ అనే నాలుగు రంగుల్లో అందిస్తోంది. దీని ధరని రూ.1,999గా నిర్ణయించారు. అలాగే బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ.1,699కే పొందే అవకాశం. ఆగష్టు 1 నుండి రియల్మీ, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్స్ లో అలాగే ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులోకి వస్తుంది.