- అమ్మకాల్లో సంచనాలను సృష్టిస్తున్న ఒప్పో Reno 14..
- కొత్త మింట్ గ్రీన్ కలర్ వేరియంట్ విడుదల.

OPPO Reno14 5G: స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో (OPPO) తన తాజా ఫోన్ Reno14 5G మోడల్‌ను గత నెలలో భారత్‌లో లాంచ్ చేసిన సంగతి విధితమే. లాంచ్ సమయంలో కేవలం పెర్ల్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ రంగులలో మొబైల్ ను విడుదల చేసింది. ఇప్పుడు అదే ఫోన్‌కు కొత్తగా ఆకర్షణీయమైన మింట్ గ్రీన్ కలర్ వేరియంట్ ను భారత మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపోతే, ఒప్పో తెలిపిన వివరాల ప్రకారం, Reno14 సిరీస్ మొదటి వారం అమ్మకాల సమయంలో గత Reno13 సిరీస్‌తో పోలిస్తే 191% అమ్మకాల వృద్ధిని సాధించిందని తెలిపింది. ఇది వినియోగదారుల నుండి వచ్చిన అద్భుతమైన స్పందనకు నిదర్శనం.
CM Chandrababu: నేడు సింగపూర్కు సీఎం చంద్రబాబు.. పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన
OPPO Reno14 5G స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ OLED స్క్రీన్ (2760 × 1256 pixels), 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్, Corning Gorilla Glass 7i
ప్రాసెసర్: 3.35GHz అక్టా కోర్ Dimensity 8350 4nm చిప్‌సెట్, Mali-G615 MC6 GPU
ర్యామ్ అండ్ స్టోరేజ్: 8GB / 12GB LPDDR5X RAM, 256GB / 512GB UFS 3.1 స్టోరేజ్
ఆపరేటింగ్ సిస్టం: Android 15, ColorOS 15
కెమెరాలు: వెనుక కెమెరా — 50MP ప్రైమరీ (IMX882, f/1.8, OIS), 8MP అల్ట్రా వైడ్ (112º OV08D, f/2.2), 50MP 3.5X పెరిస్కోప్ (JN5, f/2.8, OIS), 4K 60fps HDR వీడియో రికార్డింగ్, ఫ్రంట్ కెమెరా — 50MP (Samsung JN5, f/2.0), 4K 60fps వీడియో
BRSV Student Meet: నేడే బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు.. దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్!
ఫీచర్లు: ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో
నీరు, ధూళి నిరోధకత: IP66, IP68, IP69 రేటింగ్స్
కనెక్టివిటీ: 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, GLONASS, Beidou, Galileo, QZSS
బ్యాటరీ: 6000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
బరువు, పరిమాణం: 187 గ్రాములు, 157.90 × 74.73 × 7.32mm.
ధరలు:
Reno14 5G ఫోన్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
* 8GB + 256GB – రూ.37,999
* 12GB + 256GB – రూ.39,999
* 12GB + 512GB – రూ.42,999
కొత్త మింట్ గ్రీన్ కలర్ వేరియంట్ కూడా అదే ధరలకు లభిస్తోంది. ఈ వేరియంట్‌ను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఒప్పో అధికారిక వెబ్‌సైట్లో, అలాగే ఆఫ్లైన్ స్టోర్లలో ఈ రోజునుంచి కొనుగోలు చేయవచ్చు.