Leading News Portal in Telugu

Lava Blaze Dragon 5G Launched at Rs 9999.. 120Hz Display, Snapdragon 4 Gen 2 and Clean Android 15


  • 6.745 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 4nm చిప్‌సెట్
  • 50MP ప్రైమరీ కెమెరా LED ఫ్లాష్‌తో, 8MP సెల్ఫీ కెమెరా
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ చార్జింగ్.
  • లాంచ్ ఆఫర్ కింద రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ కూడా
  • Lava Blaze Dragon 5G మొబైల్ అధికారికంగా లాంచ్.
Lava Blaze Dragon 5G: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఆగయా.. రూ.9,999కే 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 5G ఫోన్!

Lava Blaze Dragon 5G: భారతదేశ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తన తాజా బడ్జెట్ 5G ఫోన్ Blaze Dragon 5Gను అధికారికంగా విడుదల చేసింది. మంచి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ను కంపెనీ కేవలం రూ.9,999 ధరకు తీసుకురావడం విశేషం. మరి ఈ 5G ఫోన్ విశేషాలను ఒకసారి చూసేద్దామా..

డిస్‌ప్లే అండ్ ప్రాసెసర్:
ఈ Blaze Dragon 5G ఫోన్‌లో 6.745 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ లో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 4nm చిప్‌సెట్ ఆధారంగా పనిచేతుంది. ఈ ఫోన్ 4GB LPDDR4x RAM (అదనంగా 4GB వర్చువల్ RAM), 128GB UFS 3.1 స్టోరేజ్ తో లభిస్తుంది. స్టోరేజ్‌ను మైక్రో SD ద్వారా మరింత విస్తరించుకోవచ్చు. ఈ కొత్త Blaze Dragon 5G బ్లోట్‌ వేర్ లేని క్లీన్ Android 15తో రన్ అవుతుంది. కంపెనీ ప్రకారం, ఫోన్‌కు ఒక ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, 2 సంవత్సరాల భద్రతా అప్‌డేట్లు లభించనున్నాయి.

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతిరాజు ప్రమాణ స్వీకారం

Image (3)

కెమెరాలు: 50MP ప్రైమరీ కెమెరా LED ఫ్లాష్‌తో వెనుక కెమెరా, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరా ముందు భాగంలో.

బ్యాటరీ: 5000mAh సామర్థ్యం, 18W ఫాస్ట్ చార్జింగ్

కనెక్టివిటీ: 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.4, GPS, USB Type-C

ఇతర ఫీచర్లు: సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, FM రేడియో

Suspicious Death: అమావాస్య రోజు భర్తకు పాదపూజ చేసిన భార్య.. ఆ తర్వాత రోజే హత్య

Image (4)

ధర:
ఈ కొత్త లావా Blaze Dragon 5G ఒకే ఒక వేరియంట్ 4GB + 128GB మోడల్ లో విడుదల అయ్యింది. దీనిని కేవలం రూ.9,999 ధరకు అందుబాటులో ఉంచింది కంపెనీ. ఈ ఫోన్ గోల్డెన్ మిస్ట్, మిడ్‌నైట్ మిస్ట్ రంగుల్లో లభిస్తుంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానుంది. ఇక లాంచ్ ఆఫర్ కింద రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ కూడా ప్రకటించడం కూడా విశేషం. అంతేకాదండోయ్.. ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపు లభించనుంది.

Image (5)

మొత్తంగా ఒక బడ్జెట్ ధరలోనే 5G, క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం, 120Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు అందించేందుకు లావా తీసుకువచ్చిన Blaze Dragon 5G విద్యార్థులు, మొదటిసారి 5G యూజర్లకు ఉత్తమ ఎంపికగా నిలవనుంది. రూ.10,000లోపల ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ ఛాయస్ అని చెప్పవచ్చు.

Image (6)