- టాప్ లోడ్ vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు..
- గృహ అవసరాల కోసం ఏది బెస్ట్.
- అవసరాలపై ఆధారపడి ఎంపిక అవసరం .

Washing Machine: గృహ అవసరాల కోసం వాషింగ్ మెషిన్ కొనుగోలు చేసే సమయంలో ఎదురయ్యే మొదటి ప్రశ్నే.. టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ తీసుకోవాలా? లేక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ తీసుకోవాలా..? అని. అయితే దీనికి సరైన సమాధానం మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు రకాల మెషిన్ల మధ్య డిజైన్ నుంచి పనితీరు వరకు చాలా తేడాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దామా..
Plastic Ban: ప్లాస్టిక్ నిషేధానికి ఏపీ ప్రభుత్వం చర్యలు.. ఈనెల 15 నుంచి..
టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లు పైభాగంలో డోర్ కలిగి ఉంటాయి. ఇవి నీటిని ఎక్కువగా వాడతాయి. విద్యుత్ వినియోగం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ధర తక్కువగా ఉండటంతో బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటాయి. వృద్ధులకు వీటిని ఉపయోగించడం సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో బట్టలు వేసే సమయంలో వంగి లేదా కూర్చోవాల్సిన అవసరం లేదు. అలాగే లోడ్ మధ్యలో బట్టలు మరిన్ని వేసే సౌలభ్యం కూడా ఉంటుంది. అయితే క్లీనింగ్ సామర్థ్యం ఫ్రంట్ లోడ్ కంటే కొద్దిగా తక్కువే. ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లలలో ఫాబ్రిక్ పై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ల విషయానికి వస్తే.. ఇవి ముందుభాగంలో డోర్ కలిగి ఉంటాయి. ఇవి నీటి వినియోగం తక్కువగా ఉండటంతో పాటు విద్యుత్‌ను కూడా ఆదా చేస్తాయి. ఇందులో టాప్ లోడ్ వాషింగ్ మెషిన్లతో పోలిస్తే వాష్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా డెలికేట్ బట్టలకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. స్పిన్ స్పీడ్ ఎక్కువగా ఉండటంతో బట్టలు వేగంగా ఎండిపోతాయి. అయితే ధర ఎక్కువగా ఉండటం, లోడ్ చేయాలంటే వంగాల్సి రావడం, వాష్ మధ్యలో బట్టలు యాడ్ చేయలేకపోవడం కొంతమేర వీటికి ప్రతికూలతలుగా చెప్పవచ్చు.
Radhika: నటి రాధికకు అస్వస్థత?
మొత్తంగా, మీరు తక్కువ బడ్జెట్‌లో తేలికగా ఉపయోగించగల వాషింగ్ మెషిన్ కోరుకుంటే టాప్ లోడ్ మోడల్స్ సరిపోతాయి. కానీ, మీకు అధికంగా వాషింగ్ అవసరమైన, మంచి క్లీనింగ్, నీటి, విద్యుత్ ఆదా ముఖ్యమైతే ఫ్రంట్ లోడ్ మోడల్స్ ఉత్తమం. చిన్న కుటుంబానికి టాప్ లోడ్ సరిపోతే, పెద్ద కుటుంబానికి ఫ్రంట్ లోడ్ మంచిది. కాబట్టి మీ అవసరం తగ్గట్టుగా ఎంచుకోవడం మీ బాధ్యత.