
Vivo X200 FE vs Oppo Reno 14 Pro: ప్రతిరోజు టెక్నాలజీ రంగంలో ఎన్నో మార్పులు, అప్డేట్స్ ఇలా ఎన్నో కొత్త వింతలు చూస్తున్నాం. ఇకపోతే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ మార్పులు చెప్పాల్సిన అవసరం లేదు. ఏది చూసిన ఏదో ఒక కొత్త టెక్నాలజీని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫ్లాగ్షిప్ ఫోన్ లిస్ట్ లో వివో X200 FE, ఒప్పో రెనో 14 ప్రో మధ్య పోటీ బాగా సాగుతోంది. మధ్యతరగతి ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో ఈ రెండు ఫోన్లు అత్యాధునిక ఫీచర్లతో విడుదలయ్యాయి. అయితే స్పెసిఫికేషన్, పనితీరు, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ, ధరల పరంగా చూస్తే ఏది బెస్ట్? ఎందుకు బెస్ట్.? అనేది ఒకసారి చూద్దాం..
ప్రాసెసర్:
Vivo X200 FE అత్యాధునిక MediaTek Dimensity 9300+ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది CPU వేగం, గేమింగ్ సామర్థ్యం, AI పనితీరు ఇలా అన్నింట్లో Oppo Reno 14 Proలోని Dimensity 8450 కంటే మెరుగైన ఫలితాలు ఇస్తుంది. ప్రాసెసింగ్ విషయంలో వివో స్పష్టంగా ఆధిక్యంలో ఉందని చెప్పవచ్చు.
New UPI Rules: అమల్లోకి కొత్త UPI నిబంధనలు అమల్లోకి.. బ్యాలెన్స్ చెకింగ్, ఆటోపే, API వాడకంపై పరిమితులు!
డిస్ప్లే:
Vivo X200 FE: 6.31 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, అత్యధికంగా 5000 nits బ్రైట్నెస్, 2160Hz PWM డిమ్మింగ్. మరోవైపు Oppo Reno 14 Pro మొబైల్ 6.83 అంగుళాల పెద్ద OLED డిస్ప్లే, 3840Hz PWM డిమ్మింగ్, కానీ కేవలం 1200 nits బ్రైట్నెస్ మాత్రమే లభిస్తుంది. ఈ నేపథ్యంలో వివోలో మెరుగైన బ్రైట్నెస్, ఒప్పోలో పెద్ద స్క్రీన్ అండ్ గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది.
కెమెరా సెటప్:
Oppo Reno 14 ప్రోలో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇక Vivo X200 FE లో Zeiss సహకారంతో 50MP Sony IMX921 ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ (120°), 50MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా విషయంలో రెండింట్లోనూ 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వివోలో Zeiss ట్యూన్ చేసిన లెన్స్‌లు ఉండటం ఒక ప్రత్యేకత. అలానే టెలిఫోటో జూమ్ అదనపు లాభం.
బ్యాటరీ:
Vivo X200 FE మొబైల్ లో 6,500mAh బ్యాటరీ ఉండగా.. Oppo Reno 14 Proలో 6,200mAh ఉంది. కాబట్టి వివో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ. దీని వల్ల లాంగ్ లాస్టింగ్ యూజ్ గ్యారెంటీ.
IP రేటింగ్:
రెండు ఫోన్లకూ IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అంటే సురక్షితంగా వాడొచ్చు. స్క్రీన్ ప్రొటెక్షన్ విషయంలో మాత్రం ఒప్పోకు గోరిల్లా గ్లాస్ 7i అడ్వాంటేజ్ ఉంది.
IND vs ENG: పెవిలియన్‌కు వరుస పెట్టిన టీమిండియా బ్యాటర్లు.. భారత్ 224 ఆలౌట్!
ధర:
ధర విషయానికి వస్తే, Oppo Reno 14 Pro మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12GB + 256GB వేరియంట్ రూ.49,999కు, 12GB + 512GB వేరియంట్ రూ.54,999కు లభిస్తుంది. ఇక మరోవైపు Vivo X200 FE కూడా రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులోని 12GB + 256GB వేరియంట్ రూ.54,999కు, 16GB + 512GB వేరియంట్ రూ.59,999కు లభిస్తుంది.
అయితే, వివో X200 FEలో 16GB RAM వేరియంట్ ఉండటం హెవీ యూజర్లకు అదనపు ప్రయోజనంగా నిలుస్తుంది. అయితే, ధర పరంగా తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్లు కావాలంటే ఒప్పో Reno 14 Pro మరింత మంచి ఎంపికగా చెప్పవచ్చు. ముఖ్యంగా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకున్న వినియోగదారులకు ఒప్పో వేరియంట్లు కొంచెం ‘వాల్యూ ఫర్ మనీ’ అనిపించవచ్చు.
మొత్తంగా, మీరు ఏ అంశాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటున్నారనే దానిపైనే ఎంపిక ఆధారపడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్, మంచి కెమెరా సెటప్, అధిక RAM, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం వంటి అంశాలు మీకు ప్రాధాన్యంగా ఉంటే Vivo X200 FE అనేది ఉత్తమ ఎంపిక. ఇందులో Zeiss కెమెరాలు, 16GB RAM వేరియంట్, మరియు 6500mAh పెద్ద బ్యాటరీ వంటి లక్షణాలు ఉండటంతో హై ఎండ్ యూజర్లకు ఇది బాగా సరిపోతుంది.
అలానే మీరు స్లిమ్ డిజైన్, పెద్ద డిస్ప్లే, తక్కువ ధర వంటి అంశాలపై దృష్టి పెట్టే వ్యక్తి అయితే, Oppo Reno 14 Pro మీకు అనువైన ఎంపిక అవుతుంది. ఇది తక్కువ బరువు, సన్నగా ఉండే డిజైన్, రూ. 50 వేల కంటే తక్కువ ధరలో 12GB + 256GB వేరియంట్‌ను అందిస్తోంది. కాబట్టి, మీరు ప్రాధాన్యతనిచ్చే అవసరాలపైనే ఆధారపడి ఈ రెండు ఫోన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.