
Vivo T4R vs Samsung Galaxy F36: ఈ మధ్య కాలంలో భారత మార్కెట్‌లో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్స్ మధ్య పోటీ బాగా ఎక్కువైంది. ఇకపోతే, తాజాగా విడుదలైన వివో T4R శాంసంగ్ బ్రాండ్‌కు గట్టిపోటీగా మారింది. ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకున్న సామ్‌సంగ్ గెలాక్సీ F36ను టార్గెట్ చేస్తూ వివో ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ఒకే ధరల వద్ద ఉన్న ఈ రెండు ఫోన్లు.. రెండింటి మధ్య బెస్ట్ ఎంచుకోవాలంటే ఏ అంశాలను చూడాలి? ఏది బెస్ట్ అనడానికి వాటి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, ధరల ఆధారంగా చూద్దాం.
పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. Vivo T4Rలో ఉన్న MediaTek Dimensity 7400 చిప్ అధునాతన 5G సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌లకు బాగా ఉపయోగపడుతుంది. మరోవైపు శాంసంగ్ F36లో Exynos 1380 ప్రాసెసర్ వాడబడింది. ఇది సాధారణ పనితీరు కోసం సరిపోతుంది. కానీ, వేగం పరంగా Vivoతో పోల్చితే తక్కువగా ఉంటుంది.
ఇక డిస్‌ప్లే విషయంలో Vivo T4Rలో 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉండటం వల్ల వీడియోలు, గేమింగ్‌కి అత్యద్భుత అనుభవాన్ని అందిస్తుంది. మరోవైపు, శాంసంగ్ గాలక్సీ F36లో 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్నా బ్రైట్‌నెస్ పరంగా కొంచెం తక్కువ.
BRS vs Congress : హత్నూరలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్ బాహాబాహీ..
అలాగే కెమెరా విభాగంలో రెండు ఫోన్లకూ తమదైన ప్రత్యేకత ఉంది. Vivo T4Rలో 50MP 4K Sony IMX882 ప్రైమరీ కెమెరా (OIS), 2MP బోకె లెన్స్, 32MP 4K సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది అండర్ వాటర్ ఫోటోగ్రఫీ మోడ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక శాంసంగ్ F36లో 50MP ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరాలు, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది వెర్సటైల్ కెమెరా సెటప్ కావడంతో, వివిధ ఫోటో షాట్ల కోసం అనువుగా ఉంటుంది.
డిజైన్, బరువు విషయానికి వస్తే, Vivo T4R 7.39mm మందంతో, 183.5 గ్రాముల తక్కువ బరువుతో చాలా స్లిమ్ మరియు ప్రీమియంగా కనిపిస్తుంది. Galaxy F36 7.7mm మందంతో 197 గ్రాముల బరువుతో ఉంటుంది. అందువల్ల హ్యాండ్‌లింగ్ పరంగా కూడా వివో మంచి అనుభవాన్ని ఇస్తుంది. అలాగే సేఫ్టీ విషయానికి వస్తే, Vivo T4R IP68 మరియు IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తుంది, అలాగే డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. శాంసంగ్ గాలక్సీ F36లో మాత్రం Corning Gorilla Glass Victus+ ఉంటుంది. రెండు ఫోన్లకూ ప్రొటెక్షన్ ఉన్నా వివోలో అదనంగా వాటర్ రెసిస్టెన్స్ ఉండటం కాస్త బెటర్ గా ఉంటుంది.
IND vs ENG: జైస్వాల్‌కు బయపడి.. అంపైర్‌కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్!
ఇక ధరల విషయానికి వస్తే Vivo T4R 8GB + 128GB వేరియంట్ రూ.17,499కిను అందిస్తుంది. అదే ధరకు Galaxy F36లో 6GB + 128GB మాత్రమే లభిస్తుంది. ఇంకా Vivoలో 8GB + 256GB (19,499), 12GB + 256GB (21,499) వేరియంట్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ F36లో 8GB + 256GB వేరియంట్ రూ.18,999కి లభిస్తోంది. కాబట్టి ఈ విషయంలో కూడా వివో బెస్ట్.
ఇక బ్యాటరీ పరంగా చూస్తే Vivo T4Rలో 5,700mAh కెపాసిటీ ఉంది. అయితే శాంసంగ్ Galaxy F36లో ఉన్న 5,000mAh బ్యాటరీ మాత్రమే ఉంది. కాబట్టి ఈ విషయంలో వివో బెస్ట్. ఎక్కువ టైమ్ ఫోన్ వాడే వారికి ఇది పెద్ద ప్లస్.
మొత్తంగా చూసుకుంటే, Vivo T4R ప్రాసెసర్, బ్యాటరీ, డిస్‌ప్లే, ర్యామ్, డిజైన్ ఇలా అన్ని విభాగాల్లో కాస్త ఆధిక్యత చూపుతోంది. Samsung F36 కెమెరా విభాగంలో మాత్రమే కొంచెం మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మీరు పెర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, బ్యాటరీ ప్రాధాన్యత ఇస్తే Vivo T4R ఖచ్చితంగా ఉత్తమ ఎంపిక. కెమెరా ఫీచర్ల విషయంలో శాంసంగ్‌ని నమ్మే వారు శాంసంగ్ గాలక్సీ F36 కూడా పరిగణలోకి తీసుకోవచ్చు.