- వివో నుంచి వివో Y400 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్
- 6,000mAh బ్యాటరీ
- భారత్ లో Vivo Y400 5G ప్రారంభ ధర రూ.21,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Vivo Y400 5G పేరుతో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. Vivo Y400 5Gలో 6,000mAh బ్యాటరీ. అద్భుతమైన కలర్ ఆప్షన్లు ఉన్నాయి. భారత్ లో Vivo Y400 5G ప్రారంభ ధర రూ.21,999. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.23,999 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వివో వై400 5జి గ్లామ్ వైట్, ఆలివ్ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్లలో వస్తుంది. దీని మొదటి సేల్ ఆగస్టు 7 నుంచి ప్రారంభమవుతుంది. ఇది వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రీ-బుకింగ్ చేసుకునే వినియోగదారులకు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
Vivo Y400 5G స్పెసిఫికేషన్లు
Vivo Y400 5G 6.67-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 Nits పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. వివో నుంచి వచ్చిన ఈ తాజా హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 8GB LPDDR4X RAM, 256GB UFS 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. Vivo Y400 5G కెమెరా విషయానికి వస్తే.. వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనికి 50-మెగాపిక్సెల్ సోనీ IMX852 ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. సెకండరీ కెమెరాకు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. దీనికి 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం ప్రత్యేక AI మోడ్‌లు ఉపయోగించారు. Vivo Y400 5G 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 90W వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనికి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది బయోమెట్రిక్ అథెంటికేషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP68 + IP69 రేటింగ్‌ను పొందింది. ఇది వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.