- నేటి నుంచి వివో టీ4ఆర్ 5జీ అమ్మకాలు షురూ
- లాంచింగ్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు
- వివో టీ4ఆర్ స్పెసిఫికేషన్స్ ఇవే

Vivo T4R 5G Smartphone Sales Starts in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘వివో’ ఇటీవల టీ సిరీస్‌లో కొత్త మొబైల్‌ను రిలీజ్ చేసింది. గత నెల చివరలో ‘వివో టీ4ఆర్ 5జీ’ని విడుదల చేయగా.. నేటి నుంచి అమ్మకాలు షురూ అయ్యాయి. సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ అమ్మకాలు మొదలయ్యాయి. లాంచింగ్ సేల్‌లో భాగంగా భారీ తగ్గింపు ఉంది. రూ.4 వేల తగ్గింపుతో వివో టీ4ఆర్ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ సహా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల్లో ఈరోజు నుంచి వివో టీ4ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్లకు రూ.2 వేల తక్షణ తగ్గింపు లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా మరో రూ.2000 డిస్కౌంట్ దక్కనుంది. అంతేకాదు ఎక్స్‌ఛేంజ్‌ఆఫర్ కూడా ఉంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా భారీగా ధర తగ్గనుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర 19,499.. 8జీబీ+265జీబీ వేరియంట్ ధర రూ.21,499.. 12జీబీ+256జీబీ ధర రూ.23,499గా కంపెనీ నిర్ణయించింది.
వివో టీ4ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేటు, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 ఆధారంగా పని చేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను ఇచ్చారు. వెనకాల 50 ఎంపీ సోనీ IMX882 ప్రధాన కెమెరా, 2 ఎంపీ బొకే కెమెరా ఉండగా.. ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 5700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వివో టీ4ఆర్ బ్లూ, సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.