Lenovo Idea Tab Launched in India with 11 inches display, MediaTek Dimensity 6300 SoC, 7,040mAh Battery, 5G Option Starting at 16999

Lenovo Idea Tab: చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ లెనోవో, భారత మార్కెట్లో తన కొత్త ఎంట్రీ-లెవల్ టాబ్లెట్ లెనోవో ఐడియా ట్యాబ్ (Lenovo Idea Tab)ను విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 8GB RAM తో పాటు 11 అంగుళాల 2.5K డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీంట్లో 7,040mAh బ్యాటరీ 20W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయ్యింది. Wi-Fi, 5G వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఇందులో 8MP రియర్ కెమెరా, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి.
ఈ లెనోవో ఐడియా ట్యాబ్ Wi-Fi వేరియంట్ 8GB RAM + 256GB స్టోరేజ్, Lenovo Tab Penతో రూ. 16,999గా ఉంది. అదే కాన్ఫిగరేషన్ 5G వేరియంట్ ధర రూ.19,999 గా నిర్ణయించింది కంపెనీ. ప్రస్తుతం ఈ టాబ్లెట్ లెనోవో ఇండియా వెబ్సైట్, అమెజాన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్ లూనా గ్రే కలర్లో మాత్రమే లభిస్తోంది. ఈ టాబ్లెట్ తక్కువ ధరలో 5G ఆప్షన్, AI ఫీచర్లు, హై-క్వాలిటీ డిస్ప్లేతో రావడం వల్ల స్టూడెంట్స్, కంటెంట్ క్రియేటర్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడే యూజర్స్‌కు మంచి ఆప్షన్‌గా నిలవొచ్చు.
Srushti Fertility Case: ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసులో కలకలం.. మరో ఇద్దరి వైద్యుల అరెస్టు!
లెనోవో ఐడియా ట్యాబ్ స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 11 అంగుళాల 2.5K (1,600×2,560 పిక్సెల్స్), 90Hz రిఫ్రెష్ రేట్, 16:10 ఆస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్.
ప్రాసెసర్: MediaTek Dimensity 6300 SoC.
RAM అండ్ స్టోరేజ్: 8GB LPDDR4x RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్.
కెమెరాలు: 8MP రియర్, 5MP ఫ్రంట్ కెమెరాలు.
ఆడియో: డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్లు.
కనెక్టివిటీ: Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.2.
AI ఫీచర్లు: గూగుల్ సర్కిల్ టు సెర్చ్, లెనోవో ఇన్స్టంట్ ట్రాన్స్‌లేట్, లెనోవో AI నోట్స్.
బ్యాటరీ: 7,040mAh, 20W ఫాస్ట్ చార్జింగ్, ఒక్కసారి చార్జ్‌తో 12 గంటల ప్లేబ్యాక్ టైమ్.
Infinix GT 30 5G+: షోల్డర్ ట్రిగర్స్ గేమ్ కంట్రోల్స్, 7,79,000+ AnTuTu స్కోర్‌తో నేడు లాంచ్ కానున్న ఇన్ఫినిక్స్ GT 30 5G+
ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారంగా Lenovo ZUI 17 OS.
* 2 Android OS అప్గ్రేడ్లు (Android 17 వరకు).
* 2029 వరకు 4 సంవత్సరాల సెక్యూరిటీ పాచ్‌లు.
* కీబోర్డ్, Lenovo Tab Pen, Tab Pen Plus (అదనంగా కొనుగోలు చేయాలి).
బరువు: 480 గ్రాములు.