Leading News Portal in Telugu

Infinix Hot 60i 5G to Launch in India Soon with MediaTek Dimensity 6400 SoC, 6,000mAh Battery, and AI Features


  • 50MP కెమెరా, 6,000mAh భారీ బ్యాటరీ
  • అధునాతన AI ఫీచర్లు.
  • పదివేల లోపు రానున్న Infinix Hot 60i 5G.
Infinix Hot 60i 5G: 50MP కెమెరా, 6,000mAh భారీ బ్యాటరీ ఫీచర్ల బడ్జెట్ ఫోన్.. తగ్గింపు ధరతో తీసుకొస్తున్న ఇన్ఫినిక్స్!

Infinix Hot 60i 5G: చైనీస్ టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ త్వరలో భారతదేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G (Infinix Hot 60i 5G) ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ఇదివరకు విడుదలైన Hot 60i 4G వెర్షన్‌కు ఇది 5G వెర్షన్‌గా విడుదల కాబోతుంది. ఈ మొబైల్ షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, స్లీక్ బ్లాక్, ప్లమ్ రెడ్ వంటి నాలుగు రంగుల ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం కానుంది.

ఇక ప్రధాన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G లో హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌తో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, డ్యుయల్ LED ఫ్లాష్, HDR, పానోరమా మోడ్‌లు ఉంటాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoC తో పనిచేస్తుంది. అలాగే ఈ రాబోయే 6,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉండి.. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇంత పెద్ద బ్యాటరీని అందిస్తున్న మొదటి ఫోన్‌గా కంపెనీ చెబుతోంది. దీనికి IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది.

Ravi Raja Pinisetty : అసిస్టెంట్‌‌గా నా కొడుకుని రామ్ గోపాల్ వర్మ దగ్గరికి పంపి తప్పు చేశా..

Image (7)

ఈ ఫోన్‌లో అనేక ఆధునిక AI ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. వీటిలో Circle to Search, AI Eraser, AI Extender, AI Call Translation, AI Wallpaper, AI Image Generation వంటి పలు ఆర్టిఫిషల్ ఇంటెలీజెన్స్ ఆధారిత ఫీచర్లు అందించబడనున్నాయి. ఇదివరకే ఈ మొబైల్ బంగ్లాదేశ్‌లో విడుదల కాగా అక్కడ Infinix Hot 60i (4G వెర్షన్) 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర BDT 13,999 (సుమారు 10,000)గా నిర్ణయించారు.

Image (8)

భారతదేశంలో రానున్న 5G వెర్షన్ ధర దీనికి సమానంగా లేదా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు. అక్కడ విడుదలైన 4G వెర్షన్‌ మొబైల్ లో మీడియాటెక్ హెలియో G81 SoC, 6.78-అంగుళాల IPS LCD ఫుల్-HD+ డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్, 800 nits బ్రైట్‌నెస్), 5,160mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్) ఉన్నాయి. 5G వెర్షన్ ఈ స్పెసిఫికేషన్లను మరింత మెరుగైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, ఇంకా సరికొత్త డిజైన్‌తో విడుదల కానుంది.

Trump Tariffs Effect: భయపడ్డ అమెజాన్‌, వాల్‌మార్ట్‌.. భారత్ స్టాక్ నిలిపివేత!

Image (9)