
iQOO Z10 Lite 4G: iQOO సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z10 Lite 4Gను రష్యా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ జూన్‌లో భారతదేశంలో విడుదలైన iQOO Z10 Lite 5G మోడల్‌కు 4G వెర్షన్‌గా లాంచ్ అయ్యింది. అయితే ఈ రెండు మోడళ్లలోనూ 6,000mAh బ్యాటరీ ఉండగా.. కాకపోతే చార్జింగ్ స్పీడ్‌లో తేడా ఉంది. మరి ఆ తేడాలేంటో ఒకసారి చూసేద్దామా..
iQOO Z10 Lite 4G, Android 15 ఆధారంగా రూపొందించిన Funtouch OS 15 పై నడుస్తుంది. ఇందులో 6.67-అంగుళాల (1,080×2,400 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 60Hz నుంచి 120Hz వరకు మారుతుంది. అలాగే గరిష్ట బ్రైట్‌నెస్ 1,200 nits, పిక్సెల్ డెన్సిటీ 394ppi. ఈ ఫోన్‌లో 6nm ప్రాసెస్‌పై తయారైన Qualcomm Snapdragon 685 ఆక్సా-కోర్ ప్రాసెసర్ ఉంది. అదనంగా, IP68 మరియు IP69 సర్టిఫికేషన్లు ఉండటంతో ఇది డస్ట్, వాటర్ రెసిస్టెంట్ అందిస్తుంది. అలాగే ఫోన్‌లో 8GB LPDDR4X RAM మరియు గరిష్టంగా 256GB UFS 2.2 స్టోరేజ్ లభిస్తుంది. 6,000mAh బ్యాటరీకి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది.
Supreme Court: సీబీఐ చేతికి గట్టు వామనరావు దంపతుల కేసు..
మొబైల్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8) మరియు 2MP సెకండరీ కెమెరా (f/2.4) ఉన్నాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా (f/2.0) ఉంది. ఈ ఫోన్ 4G LTE, Bluetooth 5.0, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB Type-C 2.0 పోర్ట్, GPS, BeiDou, GLONASS, Galileo, QZSS, GNSS సపోర్ట్ చేస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ టైగా (Taiga) కలర్ వెర్షన్ 7.99mm మందం, 196g బరువు కలిగి ఉండగా.. గ్లేసియర్ (Glacier) కలర్ వెర్షన్ 8.10mm మందం, 198g బరువుతో వస్తుంది.
Crime News: మేనత్తతో అల్లుడు వివాహేతర బంధం.. మామ మందలించడంతో దారుణం!
రష్యాలో iQOO Z10 Lite 4G బేస్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర 16,999 RUB అంటే సుమారు రూ.18,700గా ఉంది. అదే 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 18,499 RUB అంటే సుమారు రూ.20,300. ఈ ఫోన్ Taiga (గ్రీన్) మరియు Glacier (వైట్) కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే భారత్‌లో ఇది ఎప్పుడు విడుదల అవుతుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.