- కొత్త Galaxy Buds 3 FE ను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్
- Active Noise Cancellation (ANC) తోపాటు Galaxy AI ఫీచర్లు
- Samsung Galaxy Buds 3 FE ధర $149.99.

Samsung Galaxy Buds 3 FE: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన కొత్త Galaxy Buds 3 FE ను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. 2023 అక్టోబర్‌లో విడుదలైన Galaxy Buds FE కు ఇది నెక్స్ట్ జెనరేషన్. ఈ కొత్త ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ లో Active Noise Cancellation (ANC) తోపాటు Galaxy AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. పించ్, స్వైప్ జెష్చర్స్ ద్వారా కంట్రోల్ చేసే సౌకర్యం కూడా ఇందులో ఉన్నాయి. ANC ఆఫ్‌లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8.5 గంటల ప్లే టైమ్ ఇస్తామని శాంసంగ్ తెలిపింది. మరి ఇన్ని ఫీచర్లు ఉన్న వీటి పూర్తి డీటెయిల్స్ చూసేద్దామా..
డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్:
Galaxy Buds 3 FE లో బీన్ ఆకారపు డిజైన్ బదులు కొత్త స్టెమ్ డిజైన్ వాడారు. ఒక్కో ఇయర్‌బడ్ బరువు 5 గ్రాములు కాగా, ఛార్జింగ్ కేస్ బరువు 41.8 గ్రాములు. వాటిపై ఉండే బ్లేడ్ ద్వారా పించ్ గెష్చర్స్ తో ఎంపికలు చేయవచ్చు. అలాగే స్వైప్ ద్వారా వాల్యూమ్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంది. క్రేడిల్లో ప్రత్యేకంగా పేరింగ్ బటన్ ఉండటం వల్ల గెలాక్సీ డివైజ్‌ల మధ్య సులభంగా మార్చుకోవచ్చు. అలాగే ‘ఆటో స్విచ్’ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్‌గా ఆడియో యాక్టివిటీ గుర్తించి డివైజ్‌ల మధ్య కనెక్షన్ కొనసాగుతుంది.
IT Raids on DSR Group: DSR గ్రూప్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. టాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు!
AI, ప్రత్యేక ఫీచర్లు:
Galaxy Buds 3 FE లో Crystal Clear Call టెక్నాలజీ ఉండటం వల్ల కాల్స్ సమయంలో వాయిస్ క్లారిటీ పెరుగుతుంది. మెషీన్ లెర్నింగ్ మోడల్ ఆధారంగా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించి స్పీకర్ వాయిస్‌ను స్పష్టంగా అందిస్తుంది. ఇక AI ఫీచర్లలో “Hey Google” వాయిస్ కమాండ్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీ జెమినీ యాక్సెస్, Listening Mode & Conversation Mode తో లైవ్ ట్రాన్స్లేషన్ సపోర్ట్ కూడా లభ్యం కానుంది.
బ్యాటరీ లైఫ్:
శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE బ్యాటరీ లైఫ్ పరంగా కూడా మంచి పనితీరు చూపిస్తాయి. ANC (Active Noise Cancellation) ఆఫ్‌లో ఉంచినప్పుడు ఒక్కసారి చార్జ్‌తో 8.5 గంటల పాటు మ్యూజిక్ వినిపిస్తాయి. ఛార్జింగ్ కేస్ సాయంతో కలిపి మొత్తం 30 గంటలపాటు వినియోగం సాధ్యమవుతుంది. అదే ANC ఆన్‌లో ఉంచినప్పుడు ఒక్కసారి చార్జ్‌తో 6 గంటలపాటు మ్యూజిక్ వినవచ్చు. ఛార్జింగ్ కేస్ కలిపి మొత్తం 24 గంటలపాటు వినియోగం అందిస్తుంది.
Honey Trap: ఆన్లైన్ డేటింగ్ యాప్‌లో అమ్మాయితో పరిచయం.. అసభ్యకరంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి?
అమెరికా మార్కెట్లో Samsung Galaxy Buds 3 FE ధర $149.99 అంటే సుమారు రూ.13,000. సెప్టెంబర్ 4 నుంచి బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లలో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్లతో Galaxy Buds 3 FE, శాంసంగ్ ఆడియో ప్రొడక్ట్ లైనప్‌లో మరో ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలిచింది.