Leading News Portal in Telugu

Viral Rumors Claim AI Can Read WhatsApp Messages; Grok Clarifies on Privacy Concerns


  • వాట్సాప్ మెసేజ్లను చదివేస్తున్న ఏఐ..
  • ఏఐ పని తీరుపై నెటిజన్స్ తీవ్ర ఆందోళన..
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివాదంపై గ్రోక్ వివరణ..
AI Read WhatsApp Messages: వాట్సాప్ మెసేజ్లను చదువుతున్న ఏఐ.. గ్రోక్ ఏం చెప్పిందంటే..?

AI Read WhatsApp Messages: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్‌లలోని వ్యక్తిగత సందేశాలను కూడా ఏఐ చదివేస్తుందనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. తమ ప్రైవసీకి ముప్పు తలెత్తుతుందేమోనని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక, వాట్సాప్ లో అడ్వాన్స్ డ్ చాట్ ప్రైవసీ ఆప్షన్ ను ఎనేబుల్ చేస్తే ఆ గ్రూప్ లోని మెసేజ్ లను ఏఐ చదివేస్తుందని రూమర్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయాన్ని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ సైతం ట్వీట్ చేశారు

కాగా, గ్రోక్ మాత్రం ఈ వాదనను తప్పని తెలిపింది. వాట్సాప్‌లోని వ్యక్తిగత మెసేజ్ లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సిస్టమ్ ద్వారా రక్షించబడ్డాయి.. ఏఐ లేదా ఇతర సాంకేతికతలు నేరుగా వాటిని చదివే అవకాశం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, యూజర్ ప్రైవసీని కాపాడడం మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల యొక్క ప్రధాన కర్తవ్యం అని పేర్కొంది. అయితే, ఇది @MetaAIని ట్యాగ్ చేసినప్పుడు మాత్రమే అలా జరుగుతుందని చెప్పుకొచ్చింది. దీంతో పాటు గ్రూప్ లో స్పెసిఫిక్ అంశాలను మెటాకు ట్యాగ్ చేస్తే పూర్తి వివరాలు, ఫ్యాక్ట్ చెక్ చేయొచ్చు అని గ్రోక్ చెబుతుంది. ఇక, సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొందరు యూజర్లు టెక్నాలజీ అభివృద్ధిని స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం తమ ప్రైవసీకి భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.