
Aadhaar App: ప్రస్తుతం దేశంలో చాలా పనులు ఆధార్ కార్డు లేనిదే జరగడం లేదు. అంతలా ఆధార కార్డు భారతీయుడి జీవితంలో ప్రధానంగా మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సంబంధించి అనేకమార్లు అప్డేట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ప్రతిసారి ఆధార్ సెంటర్ కు వెళ్లి అక్కడ రుసుము చెల్లించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ తిప్పలకు చెక్ పడనుంది.
ఎందుకంటే, అతి త్వరలోనే ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో కొత్త ఈ ఆధార్ యాప్ ను లాంచ్ చేసేందుకు యుఐడిఏఐ సిద్ధమవుతుందని సమాచారం. ఇది అందుబాటులోకి వస్తే మీ మొబైల్ లోనే మీరు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ ఇలా చాలా వివరాలను అప్డేట్ చేసుకోవడం వీలవుతుంది. ప్రస్తుతం ఎవరైనా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్ళక తప్పని పరిస్థితి. దీనివల్ల చాలా సమయం, డబ్బు ఖర్చు అవుతుంది.
Pawan Kalyan: జాతీయ పార్టీగా జనసేన..! అసలు పవన్ కల్యాణ్ టార్గెట్ ఏంటి..?
చిన్న అప్డేట్ చేయాలన్నా ఆధార్ సెంటర్ల వద్ద క్యూ లో నిలబడాలి. ముఖ్యంగా పట్టణాలలలో అయితే వీటికోసం అన్ని పనులు పక్కన పీతి ఒకరోజు సెలవు పెట్టాల్సి వస్తుంది. మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేని చోట్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
దీనితో యుఐడిఏఐ ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ ఆధార్ మొబైల్ యాప్ ను అభివృద్ధి చేస్తోంది. కొత్త యాప్ వచ్చిన తర్వాత కూడా వేలి ముద్రలు ఐరిస్ స్కాన్ వంటి వాటిని అప్డేట్ చేయాలంటే మాత్రం కచ్చితంగా వ్యక్తిగతంగా ఆధార్ సెంటర్లకు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రస్తుతం బయోమెట్రిక్ అప్డేట్ గడువును 2025 నవంబర్ వరకు యుఐడిఏఐ పొడిగించింది.త్వరలో ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో కొత్త ఈ ఆధార్ యాప్ ను తీసుకొస్తున్నారు. కాబట్టి ఆధార్ వివరాల అప్డేట్ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. పైగా ఇది సురక్షితంగా కూడా ఉంటుంది.
లాంచ్ కి ముందే Samsung Galaxy F17 5G లీకైన స్పెసిఫికేషన్స్, ధరలు!
ప్రస్తుతం ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలంటే పాస్వర్డ్స్, ఓటిపిలు ఎంటర్ చేయాల్సి వస్తుంది. కానీ కొత్త యాప్ అందుబాటులోకి వస్తే ఫేస్ ఐడితో నేరుగా లాగిన్ అవుతూ నేరుగా వివరాలు అప్డేట్ చేయవచ్చు. దీనివల్ల వ్యక్తిగత వివరాలు చోరీకి మోసాలకు అవకాశం తగ్గుతుంది. కొత్త యాప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఎవరైనా వారి ఆధార్ చిరునామా వివరాలు సమర్పిస్తే యుఐడిఏఐ వద్ద ఉన్న ప్రభుత్వ డేటాబేస్ ఆధారంగా ఆ వివరాలు సరైనవో కావో క్రాస్ వెరిఫికేషన్ జరిగిపోతుంది.