- సామ్ సంగ్ మరో సంచలనం
- ట్రై ఫోల్డ్ ఫోన్ వచ్చేస్తోంది

ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు ఫోల్డబుల్ ఫోన్ లను మార్కెట్ కు పరిచయం చేసిన విషయం తెలిసిందే. త్వరలో కంపెనీ ట్రై-ఫోల్డ్ ఫోన్‌ను అంటే సామ్ సంగ్ గెలాక్సీ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు మరో రెండు ప్రొడక్టులను కూడా ఆవిష్కరిస్తుంది. Sammobile నివేదిక ప్రకారం, Samsung నవంబర్ 29, 2025న దక్షిణ కొరియాలో ఓ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో Samsung ట్రై ఫోల్డ్ ఫోన్, XR హెడ్‌సెట్ (ప్రాజెక్ట్ మూహన్ అనే కోడ్‌నేమ్), ఏఐ గ్లాసెస్ వంటి మూడు హ్యాండ్ సెట్స్ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
సామ్ సంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ కు సంబంధించిన సమాచారం యూజర్స్ లో ఇంట్రెస్ట్ ను పెంచింది. ట్రై ఫోల్డ్ ఫోన్ లో డిస్‌ప్లేను రెండుసార్లు మడతపెట్టొచ్చు. సామ్ సంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే లాంచ్ అయిన హువావే మేట్ XT అల్టిమేట్‌తో పోటీ పడనుంది. నివేదికల ప్రకారం, ఇప్పుడు సామ్ సంగ్ కూడా త్వరలో ట్రై ఫోల్డ్ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయబోతోంది. సామ్ సంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ గురించి ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. హువావే ట్రై ఫోల్డ్ హ్యాండ్‌సెట్ భారత్, అమెరికా వంటి దేశాలను మినహాయించి ఎంపిక చేసిన దేశాలలో అందుబాటులో ఉంది.
సామ్ సంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ కాకుండా, మరో రెండు ప్రొడక్ట్స్ కూడా ఆవిష్కరించనుంది. ఇందులో XR హెడ్‌సెట్ ప్లాట్‌ఫామ్ పేరు కూడా ఉంది. ఇది గూగుల్, క్వాల్కమ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతోంది. ఆండ్రాయిడ్ XR ఈ ప్లాట్‌ఫామ్‌పై నడుస్తున్న మొదటి హ్యాండ్‌సెట్ అవుతుంది. ఇది ఆపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్‌తో పోటీపడుతుంది. సామ్ సంగ్ AI గ్లాసెస్‌ను ఆవిష్కరించబోతోంది. ఇది మెటా AI గ్లాసెస్‌తో పోటీపడుతుంది. ఇవి కెమెరా, స్పీకర్, మైక్, AI కలిగిన గ్లాసెస్, వీటిని భారతదేశంలో కూడా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ సంవత్సరం ఇప్పటికే మెటా AI గ్లాసెస్‌ను భారత్ లో ప్రారంభించింది.