Oppo Reno 14 FS 5G: ఒప్పో తన రెనో 14 సిరీస్‌లో భాగంగా.. కొత్త స్మార్ట్‌ఫోన్ Oppo Reno 14 FS 5Gను అధికారికంగా లాంచ్ చేసింది. గ్లోబల్ లెవెల్ లో రీనో 14F, రీనో 14, రీనో 14 ప్రో మోడల్స్‌తో పాటు ఇప్పుడు Reno 14 FS కూడా లైనప్‌లో చేర్చింది ఒప్పో. ఈ ఫోన్ 6.7 అంగుళాల Full HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఈ మొబైల్ Qualcomm Snapdragon 6s Gen 1 ప్రాసెసర్‌తో నడుస్తూ, 8GB LPDDR4X RAM, 256GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తోంది. ఈ మొబైల్ Adreno 710 GPU తో కలిసి స్మూత్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా గూగుల్ Circle to Search, Gemini, AI Translate, AI Call Summary, AI VoiceScribe వంటి AI ప్రొడక్టివిటీ ఫీచర్లతో పాటు AI Recompose, AI Perfect Shot, AI Style Transfer వంటి కెమెరా ఆధారిత AI ఫీచర్లను కూడా అందిస్తోంది.
Lunar Eclipse: సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం? జాగ్రత్తలు, పరిహారాలు ఇలా!
ఇక కెమెరా విభాగంలో.. Reno 14 FS 5Gలో 50MP Sony IMX882 ప్రధాన కెమెరా (f/1.8 అపర్చర్), 8MP అల్ట్రా వైడ్ లెన్స్ (112° FoV), 2MP మాక్రో సెన్సార్ లభిస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా (f/2.0 అపర్చర్) ఉంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్స్‌గా Wi-Fi 5, Bluetooth 5.1, GPS, USB OTG, USB Type-C పోర్ట్ సపోర్ట్ చేస్తుంది. 7.74mm మందం, 180 గ్రాముల బరువుతో ఈ ఫోన్ కాంపాక్ట్ & ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. అంతేకాకుండా దీనికి IP68 + IP69 రేటింగ్స్ కలిగి ఉండటంతో డస్ట్, వాటర్ నుండి పూర్తి రక్షణ కల్పిస్తుంది.
IP68 రేటింగ్, ప్రీమియం ఫీచర్లతో Samsung Galaxy Tab S11, S11 Ultra లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ, 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రస్తుతం ఇది కంపెనీ లక్సెంబర్గ్ వెబ్‌సైట్‌లో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ఓపాల్ బ్లూ, లుమినోస్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.