Leading News Portal in Telugu

Huawei Mate XTs Tri-Foldable Smartphone Launched with Kirin 9020, Triple Display and 50MP Camera


  • ట్రిపుల్ ఫోల్డబుల్, Tiangong డ్యూయల్-హింజ్ డిజైన్
  • 5,600mAh బ్యాటరీ, 66W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్, 7.5W రివర్స్ వైర్‌లెస్.
  • M-Pen 3 స్టైలస్ సపోర్ట్
  • బ్లాక్, పర్పుల్, రెడ్, వైట్ రంగులలో లభ్యం
  • టాప్ ఎండ్ మోడల్ 16GB + 1TB వేరియంట్ CNY 21,999 (రూ. 2,71,900).

Huawei Mate XTs: చైనా టెక్ దిగ్గజం హువావే (Huawei) తన కొత్త ట్రై-ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Mate XTsను చైనాలో లాంచ్ చేసింది. మూడు విధాలుగా మడుచుకునే ఈ ఫోన్‌లో కిరిన్ 9020 చిప్‌సెట్ (Kirin 9020 chipset), 16GB RAM లాంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉన్నాయి. ఇది కొత్త HarmonyOS 5.1పై నడుస్తుంది. ఇక ఈ ఫోల్డబుల్ Mate XTsలో 5,600mAh బ్యాటరీ ఉంది. దీనికి 66W వైర్డ్, 50W వైర్‌లెస్, 7.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. మరోవైపు మొబైల్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇవ్వబడింది.

Trump: టెక్ సీఈవోలకు ట్రంప్ ప్రత్యేక విందు.. కనిపించని ఎలాన్ మస్క్

ఇక డిస్ప్లే విషయం చూస్తే.. Mate XTs‌లో 6.4 అంగుళాల సింగిల్ మోడ్ డిస్ప్లే (2232×1008p), 7.9 అంగుళాల డ్యుయల్ మోడ్ స్క్రీన్ (2232×2048p), పూర్తిగా తెరిచినప్పుడు 10.2 అంగుళాల ట్రై-ఫోల్డబుల్ డిస్ప్లే (2232×3184p) లభిస్తుంది. ఇవన్నీ LTPO OLED ప్యానెల్స్, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1440Hz PWM డిమ్మింగ్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్‌తో వస్తాయి. ఇక మొబైల్ కెమెరా సెటప్‌ గమనించినట్లయితే.. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 40MP అల్ట్రా-వైడ్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో (5.5x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి. అన్ని కెమెరాలు RYYB పిక్సెల్ లేఅవుట్ తో ఉండి, తక్కువ వెలుతురులో మంచి ఫోటోగ్రఫీని అందిస్తాయి. వీటిలో ప్రైమరీ, పెరిస్కోప్ కెమెరాలకు OIS సపోర్ట్ ఉంది. ముందు భాగంలో 8MP అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా పొందుపరిచారు.

Image (1)

ఇక అదనపు ఫీచర్లను గమనించినట్లయితే.. ఈ మొబైల్ కు M-Pen 3 స్టైలస్ సపోర్ట్ ఉంది. ఇది రిమోట్ కంట్రోల్ లేదా లేజర్ పాయింటర్‌లా కూడా ఉపయోగపడుతుంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 6, NFC, Bluetooth 5.2, UWB, IR బ్లాస్టర్, శాటిలైట్ కమ్యూనికేషన్, USB Type-C పోర్ట్ వంటివి ఉన్నాయి. హువావే Mate XTs ఫోన్ బరువు సుమారు 298 గ్రాములు ఉండగా, మొబైల్ పూర్తిగా తెరిచినప్పుడు మందం కేవలం 3.6mm మాత్రమే ఉంటుంది.

Flight Cancelled: సమాచారం లేకుండా విమానం రద్దు.. సిబ్బందితో సినీ నటుడి వాగ్వాదం..

Image (2)

ఇక ధరల విషయానికి వస్తే.. చైనాలో ఈ ఫోన్ 16GB + 256GB వేరియంట్ CNY 17,999 (రూ. 2,22,300) నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 16GB + 512GB వేరియంట్ CNY 19,999 (రూ. 2,47,100), ఇక టాప్ ఎండ్ మోడల్ 16GB + 1TB వేరియంట్ CNY 21,999 (రూ. 2,71,900)గా నిర్ణయించారు. ఇది బ్లాక్, పర్పుల్, రెడ్, వైట్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మొబైల్ సెప్టెంబర్ 5 నుంచి హువావే ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయం మొదలు కానుంది.

Image (3)