WhatsApp: వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ని విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ వీడియో కాల్స్‌ను మరింత ఆకర్షణీయమైన విధంగా మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ Meta AI ద్వారా పనిచేస్తుంది. వినియోగదారులు తమకు అనుగుణంగా ఉండేలా ప్రాంప్ట్‌లు, సందేశాల ఆధారంగా వివరించినప్పుడు, Meta AI ఆ వివరాల ఆధారంగా ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ లను వెంటనే తయారుచేస్తుంది.
“కెమెరా ముందు మీరు మరింత సౌకర్యవంతంగా ఉండటానికి, అలాగే సరదాగా మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి మీ అనుభవాన్ని ఎంచుకోవచ్చు” అని మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాసింది. సాంప్రదాయిక బ్యాక్ గ్రౌండ్ మధ్య ఉన్న తేడా ఏమిటంటే.. అవి ముందుగా ఇచ్చిన డిఫాల్ట్ ఇమేజ్‌లను మాత్రమే అందిస్తే, ఇప్పుడు AI ఆధారిత బ్యాక్ గ్రౌండ్ వినియోగదారుల కల్పన ఆధారంగా ప్రత్యేకమైన దృశ్యాలను సృష్టించగలవు. మీరు కొన్ని ప్రాంప్ట్‌లు, వాక్యాలతో బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉండాలనుకుంటున్నారో చెబితే, Meta AI అది వెంటనే రూపొందించి ఇవ్వడం ద్వారా మీరు వీడియో కాల్ సమయంలో వాటిని ఉపయోగించుకోవచ్చు.
ఐడెంటిటీ ప్రూఫ్‌గా Aadhaar cardను పరిగణించాల్సిందే.. ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశం!
AI జెనెరేటెడ్ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించడమెలా? అనే విషయానికి వస్తే.. వాట్సాప్ కెమెరా లో కొత్తగా “wand” (వాండ్) ఐకాన్ చేర్చింది. దీన్ని ట్యాప్ చేసినప్పుడు AR (Augmented Reality) ఆధారిత క్రియేటివ్ టూల్స్ లోడ్ అవుతాయి. మీరు confetti, stars, sparkles వంటి అనిమేటెడ్ ఓవర్లేలను జోడించుకోవచ్చు. అంతేకాకుండా, కలర్ టోన్స్ ని సర్దుబాటు చేయడం, బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, టచ్ అప్ మోడ్, లో లైట్ మోడ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ అన్ని ప్రభావాలను మీ కోసమే ఏ సమయంలో అయినా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.
AI జెనెరేటెడ్ బ్యాక్ గ్రౌండ్ సృష్టించేందుకు, ముందుగా వాట్సాప్ కెమెరా ఆన్ చేయడం లేదా వీడియో కాల్ లో జాయిన్ కావాలి. తర్వాత, call effects బటన్ నొక్కి, బ్యాక్ గ్రౌండ్స్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు “Create with AI” అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి, మీకు కావలసిన బ్యాక్ గ్రౌండ్ వివరంగా కొన్ని పదాలతో టైప్ చేయాలి. Meta AI తక్షణమే ఆ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిస్తుంది.. ఎలాంటి అదనపు యాప్‌లు అవసరం లేకుండా.
KTR: కవిత సస్పెన్షన్ తర్వాత.. మొదటిసారి మీడియా ముందుకు కేటీఆర్! ఏమన్నారంటే?
ఇక ఈ AI జెనెరేటెడ్ బ్యాక్ గ్రౌండ్ తొలగించాలంటే, వీడియో కాల్ లో చేరి లేదా వాట్సాప్ కెమెరా తెరిచి “wand” ఐకాన్ పై నొక్కాలి. తరువాత, మైనస్ ఐకాన్ (–) ను నొక్కి దానిని తీసేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొందరి వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం, AI జెనెరేటెడ్ నేపథ్యాలు ఇంగ్లీష్, హిందీ, అరబిక్, ఫ్రెంచ్, ఇండోనేషియన్, పోర్చుగీస్, స్పానిష్, టాగలాగ్, థాయ్, వియత్నా వంటి భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్ వచ్చే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుందని నివేదించారు.