Leading News Portal in Telugu

Moto Pad 60 Neo Ready Launches in India with Dolby Atmos, Pen Support and with more features


Moto Pad 60 Neo: మోటరోలా తన కొత్త టాబ్లెట్ Moto Pad 60 Neo ని భారతదేశంలో లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే Moto Pad 60 Pro తో మార్కెట్లో ఉన్న మోటరోలా, ఇప్పుడు బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ గా ఈ కొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త టాబ్లెట్ లాంచ్ తేదీ, కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరి ఆ పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా..

జీఎస్‌టీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన Toyota కార్ల ధరలు.. ఏకంగా రూ.3.49 లక్షల తగ్గింపు!

సెప్టెంబర్ 12, మధ్యాహ్నం 12 గంటలకు Moto Pad 60 Neo భారతదేశంలో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది. ఆ పోస్ట్ లో గమనించినట్లయితే.. ఈ టాబ్లెట్ డ్యూయల్-టోన్ గ్రీన్ కలర్‌లో వెనుక కెమెరా సెన్సార్‌తో కనిపిస్తుంది. ఇక ఈ టాబ్లెట్ ఫీచర్ల విషయానికొస్తే, ఇది 11 అంగుళాల, 2.5K డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ ఉంటుంది. Moto Pad 60 Neo 5G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఇది కేవలం 6.9 మి.మీ మందంతో, 490 గ్రాముల బరువుతో ఇది అత్యంత సన్నని, తేలికైన 5G టాబ్లెట్‌లలో ఒకటిగా నిలవనుంది.

Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు.. 11 మంది సీనియర్ IAS అధికారుల బదిలీ

వీటితోపాటు, ఈ టాబ్లెట్ Moto Pen కు అనుకూలంగా ఉంటుంది. ఈ పెన్ టిల్ట్ సపోర్ట్, తక్కువ లేటెన్సీ, బ్లూటూత్ ఆటో-కనెక్ట్, 4,096 స్థాయిల ప్రెజర్ సెన్సిటివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ప్యాడ్ కు 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్ కూడా లభిస్తుంది. ఈ టాబ్లెట్‌లో క్వాడ్ స్పీకర్ సిస్టమ్ ఉంది. ఇది డాల్బీ అట్మాస్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 7,040mAh బ్యాటరీతో వస్తుంది. మోటరోలా స్మార్ట్ కనెక్ట్ ఫీచర్లు అయిన క్రాస్ కంట్రోల్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ వంటివి కూడా ఇందులో ఉంటాయి. ఇకపోతే ఇదివరకు విడుదలైన Moto Pad 60 Pro ధర రూ. 26,999తో మొదలవ్వగా.. ఆ మోడల్‌తో పోలిస్తే Moto Pad 60 Neo తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.