‘యాపిల్’ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా ఈసారి కూడా ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది. ‘అవే డ్రాపింగ్’ పేరుతో యాపిల్ పార్క్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఈరోజు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెంట్‌ను యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, యాపిల్ టీవీ యాప్‌లో చూడవచ్చు. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ నాలుగు మోడళ్లను రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 17 లాంచ్ ఈవెంట్ యూఎస్‌లోని కుపెర్టినోలో జరుగనుంది. ఆ ఈవెంట్ లైవ్ అప్డేట్లు మీకు ఎప్పటికప్పుడు అందించనున్నాం.
రాత్రి 10:30 నుంచి లైవ్ బ్లాగ్ అందుబాదులోకి రానుంది .