iPhone 17 Series: ఆపిల్ (Apple) సంస్థ ప్రకటించిన iPhone 17 సిరీస్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ వివిధ శ్రేణిలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. మరి ఈ మొబైల్స్ మోడల్ ధరలు, స్టోరేజ్ ఆప్షన్స్, రంగులు, ప్రీ-ఆర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 17:
iPhone 17 ధర అమెరికాలో 256GB స్టోరేజ్ వెరియంట్ $799 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ మొబైల్ లో 512GB స్టోరేజ్ వెరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది భారతదేశంలో రూ.82,900గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, వైట్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. వీటికి సంబంధించి ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుండి ప్రారంభమై, సెప్టెంబర్ 19 నుండి గ్లోబల్ స్థాయిలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
Off The Record: కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయితీకి తెర లేస్తోందా..? ఆ ఎమ్మెల్యేలకు తిప్పలు తప్పవా..?
iPhone Air:
iPhone Air ధర అమెరికాలో 256GB స్టోరేజ్ వెరియంట్ $999 (రూ.88,100) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక భారతదేశంలో iPhone Air ధర రూ.1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 512GB వెరియంట్ రూ.1,39,900, 1TB వెరియంట్ రూ.1,59,900కు లభిస్తుంది. ఈ మొబైల్ స్కై బ్లూ, లైట్ గోల్డ్, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ రంగుల్లో లభించనుంది. ఈ మొబైల్ ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 19 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
iPhone 17 Pro & iPhone 17 Pro Max:
iPhone 17 Pro ధర అమెరికాలో 256GB స్టోరేజ్ వెరియంట్ $1,099 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 256GB స్టోరేజ్ వెరియంట్ iPhone 17 Pro Max ధర $1,199 నుంచి మొదలువుతుంది. ఇక ఈ మొబైల్ భారతదేశంలో iPhone 17 Pro ధర రూ.1,34,900 నుంచి, iPhone 17 Pro Max ధర రూ.1,49,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు ప్రొ మోడల్స్ కోస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. వీటికి సంబంధించి ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 19 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
Health Tips: గుడ్ న్యూస్.. మందులు లేకుండా షుగర్ మాయం..