Leading News Portal in Telugu

Apple iPhone 17 Launched with A19 Chip, 48MP Camera, iOS 26 – Price, Features, and Pre-Order Details


Apple iPhone 17: ఆపిల్ (Apple) సంస్థ తాజాగా నిర్వహించిన ‘Awe Dropping’ ఈవెంట్ లో కొత్త iPhone 17ను అధికారికంగా పరిచయం చేసింది. ఇది ఆపిల్ విడుదల చేసిన ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లోని బేసిక్ మోడల్. ఇందులో, గత సంవత్సరం విడుదలైన A18 చిప్‌సెట్ కు అప్డేటెడ్ గా A19 చిప్‌సెట్ ను వినియోగించారు. ఈ కొత్త మోడల్ iOS 26తో పని చేస్తుంది.

డ్యూయల్ సిమ్ సపోర్ట్:
iPhone 17 డ్యూయల్ సిమ్ సపోర్ట్ (US లో eSIM, వరల్డ్ వైడ్ గా Nano + eSIM) కలిగి ఉంటూ iOS 26 ఆధారంగా పనిచేస్తుంది. ఈ కొత్త మోడల్ 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేతో వస్తోంది. ప్రోమోషన్ ప్యానెల్ ద్వారా 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందజేస్తుంది. దీనివల్ల iPhone 17 ప్రో మోడల్స్ లాగా వేగవంతమైన, సాఫ్ట్ డిస్ప్లే అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది. ఇందులోని డిస్‌ప్లే ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇది 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే, సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్, ఎప్పుడూ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ ఈ ఫోన్‌లో కలిగి ఉంది. అలాగే IP68 రేటింగ్ కలిగి వల్ల ఇది ధూళి, నీటి నిరోధకతను కలిగి ఉంది.

iPhone 17 Series: ఆపిల్ iPhone 17 సిరీస్ లాంచ్.. ఏ ఫోన్ ఎంతకు లభిస్తుందంటే?

కెమెరాలు:
ఈ సారి కెమెరా వ్యవస్థలో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఐఫోన్ 17 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఇందులో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా f/1.6 అపెర్చర్, సెన్సార్-షిఫ్ట్ OIS కలిగి ఉంది. ఇది 2X టెలిఫోటో (52mm focal length) కెమెరాగా కూడా ఉపయోగపడుతుంది. ఆలాగే, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ అల్ట్రా వైడ్ కెమెరా (f/2.2) మాక్రో ఫోటోగ్రఫీ మద్దతుతో ఉంటుంది. ఇక ముందు భాగంలో కొత్త సెంటర్ స్టేజి సెల్ఫీ కెమెరా వినియోగదారులకు క్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ప్రాసెసర్:
iPhone 17 మొబైల్ A19 చిప్‌సెట్ పై నడుస్తుంది. ఇందులో 16-కోర్ న్యూరల్ ఎంజిన్ ఉంది. ఇది AI ఆధారిత పనులకు పవర్ ఎఫిషియంట్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆపిల్ సంస్థ ప్రకారం, iPhone 17 CPU పనితీరు iPhone 16 తో పోలిస్తే 40% వేగవంతంగా ఉంటుంది. ఈ మోడల్ 256GB బేస్ స్టోరేజ్ తో అందుబాటులోకి వస్తుంది. అలాగే, Pro మోడల్స్ లో అందుబాటులో ఉన్న ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఈ మోడల్‌లో సపోర్ట్ అవుతాయి.

Urea : పక్క దారి పడుతున్న యూరియా.. పట్టుకున్న రైతులు

బ్యాటరీ:
బ్యాటరీ పరంగా చూస్తే.. కొత్త iPhone 17 మొబైల్ iPhone 16 తో పోలిస్తే 8 గంటల అదనపు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది 3,692 mAh సామర్థ్యం ఉన్న బ్యాటిరి కలిగి ఉంది. ఇది కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తోనే 8 గంటల వాడకాన్ని పొందవచ్చు. అదేవిధంగా, 50% ఛార్జింగ్ చాలా తక్కువ సమయంలో పూర్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది, దీని వల్ల వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.

ధర:
iPhone 17 ధర అమెరికాలో 256GB స్టోరేజ్ వెరియంట్ $799 నుంచి మొదలు అవుతుంది. అదేవిధంగా 512GB స్టోరేజ్ వెరియంట్ కూడా లభించనుంది. అదే భారతదేశంలో iPhone 17 ధర రూ. 82,900 గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, వైట్, బ్లాక్ వంటి రంగుల్లో లభిస్తుంది. ఈ మొబైల్ ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుండి మొదలవుతుంది. ఇక సెప్టెంబర్ 19 నుండి ప్రపంచవ్యాప్తంగా డెలివరీలు ఇవ్వనుంది.