Leading News Portal in Telugu

Apple Watch Series 11, Watch Ultra 3 & Watch SE 3 Launched with 5G, Satellite Communication & Advanced Health Features.. Price and Specs


Apple Watch Series 11, Watch Ultra 3, Watch SE 3: ఆపిల్ సంస్థ ‘Awe Dropping’ లాంచ్ ఈవెంట్ లో తాజా స్మార్ట్‌వాచ్‌ లను విడుదల చేసింది. ఇందులో Apple Watch Series 11, Watch Ultra 3, Watch SE 3 మోడల్స్ ఉన్నాయి. ఇందులో Apple Watch Series 11 గత ఏడాదిలో విడుదలైన Watch Series 10కి అప్డేటెడ్ గా వచ్చింది. Watch SE సిరీస్ మూడు సంవత్సరాల తర్వాత Watch SE 3 (3rd Generation)గా మార్కెట్లోకి వచ్చింది. మరి వీటిగురించి విరివిరిగా చూద్దామా..

Apple Watch Series 11:
Apple Watch Series 11 5G సపోర్ట్‌తో వస్తుంది. ఇక ఇది WatchOS 26 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. ఇది 2 రెట్లు ఎక్కువ స్క్రాచ్ రేసిస్టెంట్ Ion-X గ్లాస్‌ను కలిగి ఉంటుంది. కొత్త సిరామిక్ కోటింగ్ వల్ల గ్లాస్ మరింత మన్నికైనదిగా తయారయ్యింది. 100% రీసైకిల్డ్ టైటానియం, అల్యూమినియం పదార్థాలతో తయారు చేయబడిన సిరీస్ 11 ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 24 గంటల బ్యాటరీ లైఫ్, లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్, ECG, స్లీప్ స్కోర్ సిస్టం, హైపర్ టెన్షన్ నోటిఫికేషన్స్ వంటి ఆరోగ్య సంబంధిత అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Apple Watch Ultra 3:
Apple Watch Ultra 3 కూడా 5G సపోర్ట్ కలిగి ఉంది. ఇది ఆపిల్ సంబంధిత వాటిలో అత్యంత పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఆన్ డిస్‌ప్లే ఫీచర్ తో 1Hz రిఫ్రెష్ రేట్ లో పనిచేస్తుంది. ఇంకా LTPO3 OLED స్క్రీన్ టెక్నాలజీ వల్ల డిస్‌ప్లే బీజెల్స్ 24% మందంగా తీసుక వచ్చారు. ఇది పెద్ద యాక్టివ్ స్క్రీన్ ఎరియా అందించడానికి సహాయపడుతుంది. దీనితో పాటు 42 గంటల బ్యాటరీ లైఫ్, 72 గంటల పవర్ మోడ్ సామర్థ్యం కూడా ఉంది.

అత్యాధునిక ANC, హెల్త్ ట్రాకింగ్, లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్లతో Apple AirPods Pro 3 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!

Watch Ultra 3 ప్రత్యేకతగా Two Way సాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది వినియోగదారులు ఎమర్జెన్సీ SOS అలెర్ట్లు పంపడం, ఫ్యామిలీ సభ్యులకు మెసేజ్‌లు పంపడం, లొకేషన్ షేర్ చేయడం వంటి పనులు చేయగలుగుతుంది. అలాగే ఇందులో కొత్త స్లీప్ స్కోర్ సిస్టమ్, హైపర్ టెన్షన్ నోటిఫికేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి.

Apple Watch SE 3:
Apple Watch SE 3 వాచ్ 5G కనెక్టివిటీ, కొత్త స్లీప్ స్కోర్ సిస్టమ్, ఆన్-డివైస్ సిరి సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఆల్వేస్-ఆన్ డిస్ప్లే ఫీచర్‌ను కలిగి ఉంది. ఇదివరకు ఈ ఫీచర్ ప్రీమియం మోడల్స్‌కు మాత్రమే అందింది. రెట్రోస్పెక్టీవ్ ఓవులాటిన్ ఎస్టిమేట్స్, టెంపరేచర్ సెన్సింగ్ లను కూడా ఇందులో పొందుపరిచారు. కాకపోతే, హైపర్ టెన్షన్ నోటిఫికెషన్స్ మద్దతు Series 11, Ultra 3 లాగా లేదు. ఈ Apple Watch SE 3 వాచ్ 4 రెట్లు ఎక్కువ క్రాక్-రెసిస్టెంట్ Ion-X గ్లాస్ తో తయారు చేయబడింది. అలాగే 100% రీసైకిల్డ్ అల్యూమినియం పదార్థాలతో రూపొందించబడింది. వీటితోపాటు లైవ్ ట్రాన్సలేషన్, మ్యూజిక్ ప్లేబ్యాక్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇది ఆపిల్ S10 చిప్‌తో నడుస్తుంది.

సూపర్ స్లిమ్ డిజైన్‌, 6.5-అంగుళాల ProMotion OLED డిస్‌ప్లేతో వచ్చేసిన iPhone Air..!

ధరలు:
Apple Watch Series 11 ధర అమెరికాలో $399గా ఉంది. అదే మన దేశంలో దీని ప్రారంభ ధర రూ.46,900 గా నిర్ణయించబడింది. ఈ వాచ్ 42mm, 46mm సైజులలో జెట్ బ్లాక్, రోజ్ గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రేలలో లభ్యంకానుండగా.. అల్యూమినియం కేస్ ఆప్షన్లు, అలాగే పాలిశ్డ్ టైటానియం కేస్ (న్యాచురల్, గోల్డ్, స్లాట్) కూడా అందుబాటులో ఉంటాయి. ఇక Watch Ultra 3 ప్రారంభ ధర అమెరికాలో $799 కాగా భారత్‌లో వీటి వివరాలు వెల్లడించలేదు. ఇది న్యాచురల్, బ్లాక్ టైటానియం కేస్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక Apple Watch SE 3 భారతదేశంలో రూ.25,900 నుంచి లభిస్తుంది. ఇది మిడ్ నైట్, స్టార్ లైట్ అల్యూమినియం కేస్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. మూడు కొత్త స్మార్ట్‌వాచ్‌లు సెప్టెంబర్ 19న అమ్మకానికి వస్తాయి. ప్రీ-ఆర్డర్ సెప్టెంబర్ 12 నుంచి మొదలుకానున్నాయి.