- సెప్టెంబర్ 23 నుంచి బిగ్ బిలియన్ డేస్ మొదలు
- సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు
- అతి తక్కువ ధరకే గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్
Google Pixel 9 Price Drop: ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 23 నుంచి మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే.. సెప్టెంబర్ 22నే సేల్ అందుబాటులోకి రానుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు భారీగా అందించనుంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ‘గూగుల్ పిక్సెల్ 9’ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభించనుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్ గతేడాది ఆగస్టులో లాంచ్ అయింది. లాంచ్ సమయంలో 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.64,999కి అందుబాటులో ఉంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో సగం కంటే తక్కువ ధరకే మీరు సొంతం చేసుకోవచ్చు. సేల్‌లో గూగుల్ పిక్సెల్ 9పై డీల్ ప్రైస్ రూ.37,999గా ఉంది. యాక్సిస్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ రూ.2వేలు. అలానే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ రూ.1000 ఉంది. అన్ని ఆఫర్స్ అనంతరం రూ.34,999కు గూగుల్ పిక్సెల్ 9 మీకు అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌ఛేంజ్‌పై మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 9 ఫీచర్స్:
# ఆండ్రాయిడ్ 14
# 6.3 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
# 422 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ
# 2,700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# రిఫ్రెష్ రేట్ రేజింగ్ 69హెచ్‌జడ్ నుంచి 120 హెచ్‌జడ్ వరకు
# కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 కవర్
# టెన్సార్ జీ4 ఎస్‌ఓసీ ప్రాసెసర్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్
# 50 మెగాపిక్సెల్ ఆక్టా పీడీవైడ్ యాంగిల్ కెమెరాతో పాటు, 64 మెగా పిక్సెల్ క్వాడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
# ముందువైపు కెమెరాలో 10.5 మెగాపిక్సెల్
# 4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్
# వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సైతం సపోర్టు