Samsung Galaxy F17 5G: శాంసంగ్ కంపెనీ తన గెలాక్సీ సిరీస్ లో భాగంగా నేడు (సెప్టెంబర్ 11) శాంసంగ్ గెలాక్సీ F17 5G (Samsung Galaxy F17 5G) ఫోన్‌ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ గత ఏడాది విడుదలైన F16 5Gకి తాజా వెర్షన్ (successor). ఇందులో 6.7 అంగుళాల FHD+ 90Hz Super AMOLED డిస్‌ప్లే ఉంది. మొబైల్ ను Exynos 1330 SoC ద్వారా పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా + 5MP అల్ట్రా వైడ్ కెమెరా + 2MP మాక్రో కెమెరా, 13MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది Android 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఆపరేట్ అవుతుంది. One UI 7.0 అనే ఇంటర్‌ఫేస్ మీద ఫోన్ పని చేస్తుంది. ఈ మొబైల్ కు 6 OS అప్డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు వస్తాయి. స్క్రీన్‌కు Corning Gorilla Glass Victus ప్రొటెక్షన్ ఉంది. అలాగే ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఇది వరకు మోడల్ తో పోలిస్తే స్లిమ్, తక్కువ బరువు కలిగి ఉంది.
Little Hearts : ప్రేక్షకులు నిజంగా పిచ్చోళ్లే.. మౌళి షాకింగ్ కామెంట్స్
Samsung Galaxy F17 5G స్పెసిఫికేషన్స్:
డిస్‌ప్లే: 6.7-inch (1080×2340 pixels) FHD+ Infinity-U Super AMOLED, 90Hz రిఫ్రెష్ రేట్, Corning Gorilla Glass Victus
ప్రాసెసర్: Exynos 1330 (5nm), Dual 2.4GHz Cortex-A78 + Hexa 2GHz Cortex-A55 CPUs, Mali-G68 MP2 GPU
ర్యామ్ & స్టోరేజ్: 4GB / 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (microSD ద్వారా 2TB వరకు పెంపు సాధ్యం)
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 15 + One UI 7.0
కెమెరాలు: 50MP (F1.8, AF OIS) + 5MP Ultra-wide (F2.2) + 2MP Macro (F2.2) + LED ఫ్లాష్, ముందుభాగంలో 13MP (F2.0) కెమెరా.
ఫింగర్ ప్రింట్: సైడ్ -మౌంటెడ్ స్కానర్
పోర్ట్ & కనెక్టివిటీ: USB Type-C, బ్లూటూత్ 5.3, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), NFC, GPS + GLONASS, 5G bands support (SA/NSA), Dual 4G VoLTE.
బ్యాటరీ: 5000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్
సైజు: 164.4 x 77.9 x 7.5mm.
బరువు: 192g
ప్రొటెక్షన్: IP54 డస్ట్ & వాటర్ రెసిస్టన్స్.
రంగులు: వయొలెట్ పాప్, నియో బ్లాక్.
Nijamabad : నిజామాబాద్‌లో ఉగ్ర కదలికలు కలకలం.. బోధన్ యువకుడు ఉజైఫా యామాన్ అరెస్ట్
ఇక మొబైల్ ధరల విషయానికి వస్తే.. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా ఉండగా, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.15,999కి లభిస్తుంది. ఈ ఫోన్‌ను శాంసంగ్ అధికారిక రిటైల్ స్టోర్లు, శాంసంగ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక లాంచ్ ఆఫర్లలో భాగంగా.. HDFC బ్యాంక్ కార్డులు, UPI ట్రాన్సాక్షన్ల ద్వారా కొనుగోలు చేసినప్పుడు రూ.500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా, 6 నెలల నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.