Leading News Portal in Telugu

Realme P3 Lite 5G ready to Launch with 6000mAh Battery, Military-Grade Build Under 10,000 on September 13th


Realme P3 Lite 5G: రియల్‌మీ P సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 13న రియల్‌మీ P3 లైట్ 5G అనే కొత్త మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ ఫోన్ కేవలం రూ.10,000 లోపు ధరతో, 6000mAh బ్యాటరీతో వస్తున్న అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది.

ఈ కొత్త ఫోన్ దాదాపుగా రియల్‌మీ 14X 5G స్పెసిఫికేషన్లను పోలి ఉంది. ఇందులో 6.67-అంగుళాల HD+ 120Hz LCD స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6GB వరకు ర్యామ్, డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా అదనంగా 12GB RAM ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ వస్తుంది.

Trivikram: ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్?

ఇక ఇందులో కెమెరా విషయానికొస్తే.. రియల్‌మీ P3 లైట్ 5G వెనుక భాగంలో 32MP కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉండనున్నాయి. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, దీనికి మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా లభించింది. దీనితో ఫోన్ మన్నికను పెంచుతుంది.

ఈ ఫోన్‌లో ఉన్న 6000mAh భారీ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మద్దతు ఇచ్చారు. ఈ ఫోన్ పర్పుల్ బ్లోసమ్, మిడ్‌నైట్ లిలీ, లిలీ వైట్ వంటి మూడు రంగులలో లభిస్తుంది. ఇది 4GB + 128GB, 6GB + 128GB వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అల్ట్రా లీనియర్ బాటమ్-పోర్టెడ్ స్పీకర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

Youtube కంటెంట్ క్రియేటర్లకు పండుగే.. మరింత విస్తరించనున్న మల్టీ లాంగ్వేజ్ ఫీచర్!