Leading News Portal in Telugu

Itel Super 26 Ultra Launched Globally with 6000mAh Battery, 144Hz AMOLED Display, 50MP Camera


Itel Super 26 Ultra: ప్రసిద్ధ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఐటెల్ Itel Super 26 Ultra స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. మంచి ఫీచర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యం, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అధునాతన అనుభవాన్ని అందించేందుకు మొబైల్ సిద్ధమైంది. ఈ కొత్త Itel Super 26 Ultraలో 6.78-inch 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. అలాగే Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ ఉంటుంది. అంతేకాకుండా, “Rain-proof” ఫీచర్ కలిగి ఉండటం వల్ల తడి స్క్రీన్ వాతావరణంలో కూడా ఫోన్ సౌకర్యవంతంగా పనిచేస్తుంది.

Asia Cup 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్!

ఇక మొబైల్ కెమెరాల విషయానికి వస్తే.. ఇది 50-megapixel ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కలిగి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. అలాగే ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక IP65 రేటింగ్ కలిగి ఉండటం వలన డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా కలిగి ఉంది. ఇక ఇందులో 6nm Unisoc T7300 చిప్‌సెట్ ను ప్రాసెసర్ గా ఉపయోగించారు. ఫోన్‌లో 8GB ర్యామ్ కు 128GB లేదా 256GB స్టోరేజ్ వేరియంట్లు లభించనున్నాయి.

ఇక అదనపు ఫీచర్లలో NFC, Wi-Fi, బ్లూటూత్ , IR ట్రాన్స్మిట్టర్స్ ఉన్నాయి. అలాగే, AI కెమెరా ఎరేజర్, సర్కిల్ టు సెర్చ్, ఇంటర్నల్ AI అసిస్టెంట్ ‘సోల’ వంటి ప్రత్యేక AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక బ్యాటరీ సామర్థ్యం పరంగా 6000mAh బ్యాటరీ ఉండగా.. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. Itel Super 26 Ultra కేవలం 6.8mm మందంతో సన్నని బిల్డ్ కలిగి ఉంటుంది.

Dowry Harassment: పెళ్లయిన 4 నెలలకే.. వరకట్న దాహానికి నవ వధువు బలి..

Itel Super 26 Ultra ప్రస్తుతం నైజీరియాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. అమ్మకాలు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫోను బీజ్, బ్లూ, గోల్డ్, గ్రే అనే నాలుగు రంగులలో అందుబాటులో ఉన్నాయి. బంగ్లాదేశ్లో 8GB + 128GB వేరియంట్ ధర BDT 19,990 (రూ. 14,900), 8GB + 256GB వేరియంట్ ధర BDT 21,990 (రూ. 15,900)గా ఉంది.