Moto Pad 60 NEO: మోటోరోలా తన సరికొత్త టాబ్లెట్, మోటో ప్యాడ్ 60 నియో (Moto Pad 60 NEO)ను భారతదేశంలో విడుదల చేసింది. 5జీ కనెక్టివిటీ, సన్నని డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో ఈ టాబ్లెట్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త టాబ్లెట్ 11 అంగుళాల 2.5K ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంది. అంతేకాకుండా, TÜV రైన్‌ల్యాండ్ ఫ్లికర్-ఫ్రీ, లో బ్లూ లైట్ సర్టిఫికేషన్లు ఉండటం వల్ల కళ్లకు ఒత్తిడి లేకుండా వినియోగించవచ్చు. కేవలం 6.99 మిల్లీమీటర్ల మందంతో ఈ విభాగంలో అత్యంత సన్నని, తేలికైన టాబ్లెట్‌గా నిలిచింది. దీని బరువు 480 గ్రాములు మాత్రమే ఉండడం విశేషం.
Extramarital Affair: అక్రమ సంబంధం వద్దన్నందుకు.. ఆమెతో పాటు తల్లిని కిడ్నాప్ చేసిన ప్రియుడు
మోటో ప్యాడ్ 60 నియో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ 8జీబీ ర్యామ్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా మెమరీని 2టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ టాబ్లెట్‌లో వెనుక వైపు 8 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా, ముందు వైపు 5 మెగాపిక్సెల్ ఫిక్స్డ్ ఫోకస్ కెమెరా ఉన్నాయి. అలాగే ఇది డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్ IP52 రేటింగ్ కలిగి ఉంది. ఇందులో క్వాడ్ స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి.
4GB లిమిటెడ్ ఎడిషన్‌గా POCO M7 Plus 5G.. పూర్తి వివరాలు ఇలా!
ఇక టాబ్లెట్‌లో 7040mah బ్యాటరీ మాత్రమే ఉంది. ఇది 20W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, దీనితో పాటు 68W ఛార్జర్ బాక్స్‌లోనే వస్తుంది. 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.2, GPS వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. మోటో ప్యాడ్ 60 నియో ప్యాంటోన్ బ్రాంజ్ గ్రీన్ రంగులో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ 5జీ మోడల్ ధర రూ. 17,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుంది. లాంచ్ లో భాగంగా బ్యాంక్ ఆఫర్లతో దీని ధర రూ. 12,999కి లభిస్తుంది. అంతేకాకుండా, దీని బాక్స్‌లో మోటో పెన్ కూడా ఉచితంగా వస్తుంది.